Mufasa: The Lion King : ఓటిటిలోకి ముఫాసా : ద లయన్ కింగ్

Mufasa: The Lion King :  ఓటిటిలోకి ముఫాసా : ద లయన్ కింగ్
X

యానిమల్స్ దే అయినా ప్రపంచం మొత్తాన్ని మెస్మరైజ్ చేసిన సినిమా ద లయన్ కింగ్. వల్డ్ వైడ్ గా అన్ని భాషల్లోనూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందీ చిత్రం. ఈ మూవీకి సీక్వెల్ గా వచ్చింది ముఫాసా ద లయన్ కింగ్. గతేడాది డిసెంబర్ 20న విడుదలైన ఈ మూవీలో ముఫాసా పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నాడు అని తెలిసినప్పటి నుంచి ఆ మూవీని మహేష్ ఫ్యాన్స్ బాగా ఓన్ చేసుకున్నారు. కటౌట్స్ కట్టారు. థియేటర్స్ వద్ద అతని సినిమానే విడుదలవుతుందా అన్న రేంజ్ లో హంగామా చేశారు. ఇక బ్రహ్మానందం, అలీ పాత్రల వాయిస్ లు అలాగే ఉండటంతో ఎంటర్టైన్మెంట్ కూడా ఆకట్టుకుందీ మూవీలో.

థియేటర్స్ లో మాత్రం అనుకున్న రేంజ్ లో ఈ మూవీకి అప్లాజ్ రాలేదు అనే చెప్పాలి. ద లయన్ కింగ్ లో ఉన్న ఎమోషన్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ మిస్ అయిందన్నారు. కేవలం మహేష్ వాయిస్ కోసమే చూసినవాళ్లూ ఉన్నారు. ఆ కారణంగానే మిగతా భాషల కంటే తెలుగులో కాస్త ఎక్కువ వర్కవుట్ అయింది. ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నవారికి వెయిటింగ్ కు ఎండ్ కార్డ్ పడింది.

ముఫాసా ద లయన్ కింగ్ ఈ నెల 26 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది. జియో హాట్ స్టార్ కలిసిన తర్వాత వస్తోన్న పెద్ద సినిమాల్లో ఇదీ ఒకటి. మరి ఈ కాంబోకు లయన్ కింగ్ ఎలా ప్లస్ అవుతాడో కానీ.. ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఓటిటి ప్లాట్ ఫామ్ లో అందుకుబాటులో ఉంటుంది. సో థియేటర్స్ లో చూడని వాళ్లు ఇక ఎన్నిసార్లైనా ఇంట్లోనే చూసేయొచ్చన్నమాట.

Tags

Next Story