Mukesh Khanna: సిగ్గులేదు వాళ్లకి.. సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది: దీపిక దుస్తులపై ముఖేష్ ఫైర్

Mukesh Khanna: సిగ్గులేదు వాళ్లకి.. సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది: దీపిక దుస్తులపై ముఖేష్ ఫైర్
X
Mukesh Khanna: బేషరమ్ రంగ్ పాట వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. అయినా చిత్ర యూనిట్ ఏ మాత్రం స్పందించట్లేదు. ఇది కూడా ఓరకం పబ్లిసిటీ అనుకుంటున్నారో ఏమో.

Mukesh Khanna: బేషరమ్ రంగ్ పాట వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. అయినా చిత్ర యూనిట్ ఏ మాత్రం స్పందించట్లేదు. ఇది కూడా ఓరకం పబ్లిసిటీ అనుకుంటున్నారో ఏమో. తాజాగా శక్తిమాన్ పాత్రధారి ముఖేష్ ఖన్నా బేషరమ్ పాటలో దీపిక వేసుకున్న దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు చిన్న చిన్న పీలికలు చుట్టుకుంటున్నారు. ముందు ముందు అవి కూడా వేసుకోకుండా నగ్నంగా నటిస్తారేమో అని తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయినా ఇలాంటి వాటిని సెన్సార్ బోర్డు ఎలా అంగీకరిస్తోంది. ఇలాంటివి ప్రేక్షకులకు చూపించి సమాజానికి ఏం చెప్పాలనుకుంటోంది అని ఆయన చిత్ర యూనిట్‌ను, నటీనటులను తప్పుపట్టారు.


షారుఖ్ ఖాన్ నటిస్తున్న పఠాన్‌ చిత్రంలోని పాట రిలీజ్ అయిన దగ్గర నుంచి రోజుకో వివాదం చుట్టుముడుతోంది. పాటలో దీపిక వేసుకున్న డ్రెస్ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే మాదిరిగా ఉందనిముఖేష్ ఖన్నా అభ్యంతరం వ్యక్తం చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ దానిని ఎలా ఆమోదించగలదని ప్రశ్నించారు. ఇలాంటి అసభ్యతను ఎవరూ ఆమోదించకూడదు అని ఆయన అన్నారు.


ఈ వారం పాట విడుదలైనప్పటి నుండి వివాదాలను ఎదుర్కొంటోంది. అసభ్యకరంగా ఉందని పాటపై ట్రోల్స్ దాడి చేయగా, దీపిక వేషధారణకు కాషాయ రంగును ఉపయోగించడంపై రాజకీయ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.


పాటపై వ్యాఖ్యానించిన ముఖేష్ ఖన్నా .."మన సినిమా పరిశ్రమ గందరగోళానికి గురైందని నేను భావిస్తున్నాను. ఇది వల్గారిటీకి సంబంధించిన విషయం, దీనికి మతపరమైన సమస్యతో సంబంధం లేదు. సెన్సార్ బోర్డు సుప్రీంకోర్టు కాదు. వారు నాకు చాలా ప్రముఖ వ్యక్తులుగా కనబడతారు. మరి ఇలాంటి వాటిని ఎలా ఆమోదిస్తారు అని అన్నారు.


మన దేశం స్పెయిన్ లేదా స్వీడన్ కాదు. ఇక్కడ ప్రతిదీ ఆమోదయోగ్యం కాదు. ఇప్పడు ఇలాంటి దుస్తులు ధరించి డ్యాన్సులు చేస్తున్నారు. తరువాత బట్టలు లేకుండా నటీమణులను చూపిస్తారా. ఎవరి వ్యక్తిగత మనోభావాలు, నమ్మకాలు దెబ్బతినకుండా చూడటమే సెన్సార్ బోర్డు పని.



యువతను ప్రేరేపించే లేదా తప్పుదోవ పట్టించే సినిమాలను సెన్సార్ పాస్ చేయకూడదు. ఈ పాట యువత మనసులను తప్ప తప్పుదారి పట్టిస్తుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఓటీటీ కోసం చేసిన పాట కాదు, సినిమా. సెన్సార్ ఎలా ఆమోదించింది? వారు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే డ్రెస్సింగ్ చూడలేదా? అని ఆయన బేషరమ్ పాటను ఉద్దేశించి అన్నారు.

బీజేపీ మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ బేషరమ్ రంగ్ "చెత్త ఆలోచన"ని ప్రతిబింబిస్తోందని, మధ్యప్రదేశ్‌లో పఠాన్‌ను విడుదల చేయకూడదని అన్నారు. మధ్యప్రదేశ్ ఉలేమా బోర్డు కూడా రాష్ట్రంలో సినిమా విడుదలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎంపి ఉలేమా బోర్డు ప్రెసిడెంట్ సయ్యద్ అనాస్ అలీ కూడా ఈ చిత్రం ద్వారా "ముస్లిం కమ్యూనిటీ యొక్క మనోభావాలను దెబ్బతీశారని" అన్నారు, "ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అనుమతించేది లేదు" అని ఆయన అన్నారు.

Tags

Next Story