Mukku Avinash: అనుజతో అవినాష్.. ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వైరల్..

ప్రముఖ టెలివిజన్ కమెడియన్ అవినాష్ అతని నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చాడు. తన పెళ్లి ఫిక్స్ అయినట్లు ధృవీకరించాడు. త్వరలో అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అవినాష్ హాస్యనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి నుండి తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అనేక కార్యక్రమాల్లో కామెడీ చేయడం ద్వారా తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 4లో ఓ కంటెస్టెంట్ ఇంట్లోకి ప్రవేశించి కామెడీని పండించాడు. మరో కంటెస్టెంట్ అరియానాతో పులిహోర కలిపాడు. మాట్లాడితే పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చేవాడు. పెళ్లి చేసుకుందామంటే పిల్ల దొరకట్లేదని వాపోయేవాడు.
బిగ్ బాస్ హౌస్‌లో తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు, యాంకర్ అరియానాతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించడం అనేక అనుమానాలకు దారితీసింది. ఆ తర్వాత తమ ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉందని క్లారిటీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అవినాష్ పెళ్లి వార్త అభిమానులను ఆశ్చర్యపరిచింది. తన చిన్ననాటి స్నేహితురాలు అనూజతో జీవితాన్ని పంచుకోనున్నట్లు ప్రకటించాడు. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు షేర్ చేశాడు.
సరైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తుంటే వేచి చూడాల్సిన అవసరం లేదు. అనూజతో నాకు నిశ్చితార్థం అయింది. పెళ్లి ఎప్పుడు అని మీరంతా నన్ను చాలా సార్లు అడిగారు. అతి త్వరలో నా అనుజతో.. ఎప్పటిలాగే మీ ఆశీస్సులు కోరుకుంటూ మీ ముక్కు అవానాష్.. అని ఇన్‌స్టా వేదికగా నిశ్చితార్థం ఫోటోలను పంచుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com