Multiplex Offer Ticket : మల్టీప్లెక్స్‌లో ఆ రోజు రూ.75కే మూవీ టికెట్..

Multiplex Offer Ticket : మల్టీప్లెక్స్‌లో ఆ రోజు రూ.75కే  మూవీ టికెట్..
Multiplex Offer Ticket : మల్టీప్లెక్ష్ థియేటర్ యజమానులు ప్రేక్షకులకు ఓ రోజు బంపర్ ఆఫర్ ప్రకటించారు

Multiplex Offer Ticket : మల్టీప్లెక్ష్ థియేటర్ యజమానులు ప్రేక్షకులకు ఓ రోజు బంపర్ ఆఫర్ ప్రకటించారు. రూ. 200 నుంచి 300 వరకు ఉన్న టికెట్‌ను కేవలం రూ.75కే అందించనున్నారు. అయితే ఈ ఆఫర్ కేవలం సెప్టెంబర్ 16న నేషనల్ సినిమా డే రోజే వర్తిస్తుంది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ సరికొత్త నిర్ణయం తీసుకుంది. అమెరికా, యూకెలో సెప్టెంబర్ 3న సినిమాడే సెలబ్రేషన్స్ జరిగాయి.

భారత్‌లో సెప్టెంబర్ 16న జరుగనున్నాయి. దేశంలో సుమారు 4వేల వరకు మల్టీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. అన్ని థియేటర్లలో ఈ ఆఫర్ ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలను ఆయా మల్టీప్లెక్స్‌లలో అందుబాటులో ఉంటాయి లేదంటే వారి అఫిషియల్ వెబ్‌సైట్లలో ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఈ ఆఫర్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు కాని రూ.75కి అదనంగా ఇంటర్నెట్ చార్జీలు, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 16 నాటికి 'బ్రహ్మాస్త్ర', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'కోటికొక్కడు', 'శాకిని-డాకిని' చిత్రాలు మల్టీప్లెక్స్‌లలో ప్లే అవుతుంటాయి. ఈ చిత్రాలను తక్కువ రేటుతో చూసే అవకాశాన్ని ప్రేక్షకులు పొందవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story