Mohanlal : మోహన్ లాల్, మమ్మూట్టితో మల్టీస్టారర్

ఏ భాషలో అయినా టాప్ స్టార్స్ కలిసి నటిస్తున్నారు అంటే ఉండే క్రేజ్ వేరే కదా. ఈ విషయంలో మళయాలంలో టాప్ స్టార్స్ కలిసి నటించడం కామన్ గానే ఉంటుంది. అయితే ఈ ఇద్దరు కలిసి నటించి చాలాకాలం అయింది. అందుకే ఇప్పుడు భారీ క్రేజ్ ఏర్పడింది. మోహన్ లాల్, మమ్మూట్టి కలిసి నటిస్తున్నారు అంటే మాలీవుడ్ లో మంచి విషయమే అవుతుంది. మరి ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న మూవీ ‘పేట్రియాట్’. ఈ తరహా టైటిల్ తో ఇద్దరు కలిసి నటించడం మాత్రం ఆకట్టుకునే అంశం అనే చెప్పాలి. ఈ ఇద్దరితో పాటు ఫహాద్ ఫాజిల్, నయనతార, కుంచకో బొబ్బన్ నటించడం మాత్రం ఈ ప్రాజెక్ట్ పై తిరుగులేని అంచనాలు ఏర్పడుతాయి.
కొన్నాళ్లుగా మోహన్ లాల్, మమ్మూట్టి కలిసి నటించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఫైనల్ గా ఆ ఇద్దరూ కలిసి నటించబోతుండటం మాత్రం ఈ మూవీపై ఏర్పడిన క్రేజ్ కు నిదర్శనం. ఇక ఈమూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ఈ యేడాది ఏప్రిల్ 23న చిత్రాన్ని విడుదల చేస్తాం అని ప్రకటించారు. ఈ సమ్మర్ లో విడుదల కాబోతోందీ మూవీ అన్నమాట. ఇది కూడా కొత్త విషయమే అని చెప్పాలి. నిజంగా ఈ ఇద్దరూ కలిసి నటించడం అనే విషయం కూడా ముందు నుంచీ తెలియకుండా దాచారు. ఇప్పుడు ఏకంగా రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం మాత్రం డబుల్ హ్యాపీస్ అవుతుంది. మొత్తంగా మోహన్ లాల్, మమ్మూట్టి కలిసి నటించబోతోన్న పేట్రియాట్ మూవీ 23.01.26న విడుదల కాబోతోందన్నమాట.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
