Mumaith Khan : బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ... ముమైత్‌‌‌ఖాన్‌ ఎలిమినేట్‌

Mumaith Khan : బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ... ముమైత్‌‌‌ఖాన్‌ ఎలిమినేట్‌
Mumaith Khan : ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు రావడంతో షో నుంచి ఆమె ఎలిమినేట్‌ అయినట్లుగా హోస్ట్ నాగార్జున ప్రకటించాడు

Mumaith Khan : ఓటీటీ బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో నుంచి ముమైత్‌‌ఖాన్ ఎలిమినేట్ అయింది.. ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు రావడంతో షో నుంచి ఆమె ఎలిమినేట్‌ అయినట్లుగా హోస్ట్ నాగార్జున ప్రకటించాడు. ఈ వారం నటరాజ్‌ మాస్టర్‌, అరియానా, సరయు, హమీదా, ముమైత్‌ ఖాన్‌, మిత్రశర్మ, ఆర్జే చైతులు నామినేట్‌ అయ్యారు.


చివరికి ముమైత్‌ఖాన్ ఎలిమినేట్‌ అయిపొయింది. అయితే షో నుంచి ఇంత త్వరగా బయటకు రావాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదని ముమైత్‌‌ఖాన్ చెప్పుకొచ్చింది. ఎలిమినేషన్‌ సమయంలో నవ్వుతూ కనిపించిన ఆమె.. స్టేజీ పైకి రాగానే ఎమోషనల్ అయింది. తనకి అగ్రెసివ్‌ అంటూ ట్యాగ్‌ ఇచ్చారని బాధపడింది.


ఇక హౌజ్‌‌లో విలువైన వ్యక్తులు(వర్తీ), పనికిరాని వాళ్లు((వేస్ట్‌)) అనే ట్యాగ్ ఎవరికీ ఇస్తావని నాగార్జున అడిగితే అఖిల్‌, అజయ్‌, తేజస్విని, అరియానా, అషురెడ్డిలకు వర్తీ ట్యాగ్, సరయు, మిత్ర, శివ, బిందు, ఆర్జే చైతులకు వేస్ట్‌ ట్యాగ్‌ ఇస్తానని ముమైత్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story