Mumaith Khan : బిగ్‌బాస్ నాన్‌స్టాప్ : వారానికి ముమైత్‌ఖాన్ రెమ్యునరేషన్ ఎంతంటే...!

Mumaith Khan : ఓటీటీ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో నుంచి ముమైత్‌ఖాన్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.. ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు రావడంతో షో నుంచి ఆమె ఎలిమినేట్ అయినట్లుగా హోస్ట్ నాగార్జున ప్రకటించాడు.
షో నుంచి ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్ ఆమె... అయితే షో నుంచి ఇంత త్వరగా బయటకు రావాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదని ముమైత్‌ఖాన్ స్టేజీ పైన ఎమోషనల్ అయింది. ఇదిలావుండగా ఆమె రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ముమైత్ కి వారానికి రూ. 80 వేలను షో నిర్వాహకులు చెల్లించినట్లుగా తెలుస్తోంది. దిన్ని బట్టి చూస్తే ఆమె రెమ్యునరేషన్ లక్ష రూపాయల లోపే ఉండవచ్చని సమాచారం.
ఇక షో నుంచి బయటకు వచ్చేముందు హౌజ్‌లో విలువైన వ్యక్తులు(వర్తీ), పనికిరాని వాళ్లు((వేస్ట్)) అనే ట్యాగ్ ఎవరికీ ఇస్తావని నాగార్జున అడిగితే అఖిల్, అజయ్, తేజస్విని, అరియానా, అషురెడ్డిలకు వర్తీ ట్యాగ్, సరయు, మిత్ర, శివ, బిందు, ఆర్జే చైతులకు వేస్ట్ ట్యాగ్ ఇస్తానని ముమైత్ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com