Hasini Sudhir : తెలుగు తెరపై మరో ముంబై భామ

ఎందరో ముంబై భామలు తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతున్నారు. ఇవాళ మరో మరాఠా ముద్దుగుమ్మ తెలుగు తెరపై తళుక్కుమననుంది. ఇవాళ విడుదలైన పురుషోత్తముడు సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది హాసినీ సుధీర్. మహారాష్ట్రకు చెందిన ఈ బ్యూటీ హీరోయిన్ కావాలన్న చిన్న నాటి కలను తెలుగు తెరపై నిజం చేసుకుంటోంది. ఈ సినిమాలో తన పాత్ర పేరు అమ్ములు అని, అంతా అమ్ము అని పిలుస్తారని హాసిని చెబుతోంది. తెలుగు సినిమాలు చూస్తూ పెరగడం వల్ల తెలుగు త్వరగా నేర్చుకున్నట్లు చెబుతోంది. తొలి సినిమాలోనే ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ వంటి సీనియర్స్ తో కలిసి నటించడం వల్ల ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నట్లు తెలిపింది. ఈ సినిమాతో తెలుగులో తనకు బ్రేక్ వస్తోందని నమ్ముతోంది. భవిష్యత్తులో లవ్ స్టొరీస్ తో పాటు యాక్షన్ మూవీస్ చేయాలనుకుంటున్నట్లు హాసినీ సుధీర్ చెబుతోంది. పురుషోత్తముడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ మరాఠా ముద్దుగుమ్మను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారో..? లేదో..?
అనేది ఆసక్తికరంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com