Kavya Thapar: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన నటి.. ప్రస్తుతం కస్టడీలో..

Kavya Thapar (tv5news.in)
Kavya Thapar: డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎంత ప్రమాదకరమని అందరికీ తెలుసు. కానీ చాలావరకు మద్యపానానికి అలవాటు పడినవారు మాత్రం ఈ విషయాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోరు. అయితే సెలబ్రిటీల హోదాలో ఉన్నవారు అలాంటి వారి మార్పుకు కారణం కావాలి. అలాంటి వారికి ఉదాహరణగా నిలవాలి. కానీ సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడు ఇలాంటి తప్పులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ నటి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరకడం సంచలనం సృష్టించింది.
కావ్య థాపర్.. పేరుకే తాను ఒక మరాఠీ అమ్మాయి. కానీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది, గుర్తింపు తెచ్చుకుంది అంతా టాలీవుడ్‌లోనే. ముందుగా తాను కాలేజీలో చదువుతున్న రోజుల్లో సరదాగా ఓ హిందీ షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేసింది కావ్య.. అలా మెల్లమెల్లగా సినిమాలవైపు తన అడుగులు పడ్డాయి. ఇటీవల సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన 'ఏక్ మినీ కథ' చిత్రంతో హీరోయిన్‌గా కావ్య కెరీర్‌కు మంచి బ్రేక్ వచ్చింది.
కావ్య థాపర్ ముంబాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిందన్న వార్త ప్రస్తుతం సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. గురువారం ఉదయం కావ్య మద్యం మత్తులో ఓ కారును ఢీకొట్టడంతో అందులో ఉన్న వ్యక్తికి గాయాలు అయ్యాయని ముంబాయి పోలీసులు అంటున్నారు. అంతే కాకుండా పోలీసులతో అసభ్యంగా మాట్లాడిందని, ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ కాలర్ పట్టుకుందని కావ్యపై కేసులు నమోదయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com