Vijay Devarakonda: విజయ్‌పై థియేటర్ యజమాని ఫైర్.. సినిమా రిలీజ్‌కి ముందు ఏంటా మాటలు..

Vijay Devarakonda: దర్శకుడు పూరీ జగన్నాథ్‌కి, నటుడు విజయ్ దేవరకొండకి బ్యాండ్ టైమ్ నడుస్తుందో ఏమో.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన లైగర్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అసలు అది పూరీ సినిమానేనా అని జనాలు అనుకునేలా ఉంది. విజయ్.. లైగర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.. మరికొన్ని సినిమాల్లో ఆఫర్లు వస్తాయనుకుంటే చేసిన మొదటి సినిమానే బెడిసికొట్టింది.
సినిమా రిలీజ్‌కు నెల రోజుల ముందు నుంచి దేశ వ్యాప్తంగా ప్రమోషన్ పేరుతో 17 నగరాలు చుట్టేశారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక మొత్తం గాలి తీసేసినట్లైంది. సినిమాపై విజయ్ పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. దీనికంతటికీ కారణం అతడు చేసిన కామెంట్లే అని థియేటర్ యాజమాని విజయ్‌పై ఫైర్ అవుతున్నాడు.
ముంబైకి చెందిన ఓ థియేటర్ యజమాని మనోజ్ దేశాయ్.. ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడిన మాటలను తప్పుపట్టారు.. మా సినిమాను బాయ్‌కాట్ చేసుకోండి అని చెప్పి తెలివిని ప్రదర్శిచాననుకుంటున్నావా.. కనీసం ఓటీటీలో కూడా నీ సినిమా చూడరు.. నీ ప్రవర్తన వల్ల మేము నష్టపోతున్నాం. అడ్వాన్స్ బుకింగ్స్‌పై కూడా దాని ఎఫెక్ట్ పడింది. మిస్టర్ విజయ్ నువ్వు కొండవి కాదు అనకొండవి. ఆచి తూచి మాట్లాడాల్సిన సమయంలో అలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నష్టపోయేది ఎవరు.. ఆమాత్రం తెలియదా..
ఆమిర్ ఖాన్, తాప్సీ, అక్షయ్ కుమార్ సినిమాలకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడి సినిమాను ఫ్లాప్ చేశావు.. లైగర్ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడడం వల్ల చాలా నష్టపోయాం అని తన ఆవేదన అంతా వెళ్లగక్కాడు ముంబైకి చెందిన థియేటర్ యజమాని.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com