సినిమా

Murali Mohan: విష్ణు, ప్రకాశ్ రాజ్ గురించి అసలు నిజం చెప్పిన మురళీమోహన్

Murali Mohan: మా ఎన్నికలు 2021 గురించి ఎవరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

Murali Mohan: విష్ణు, ప్రకాశ్ రాజ్ గురించి అసలు నిజం చెప్పిన మురళీమోహన్
X

Murali Mohan: మా ఎన్నికలు 2021 గురించి ఎవరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వీటి గురించి ఎవరికీ తెలియకపోయినా.. ఈసారి పూర్తిగా రాజకీయంగా మారిన ఈ ఎన్నికల గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. మా ఎన్నికలు పలుమార్లు వాయిదా పడి చివరిగా అక్టోబర్ 10న తేదీని ఖరారు చేసుకున్నాయి. పలుమార్లు మా అధ్యక్షుడిగా ఉన్న మురళీ మోహన్ ఇటీవల ఈసారి ఎన్నికలపై కామెంట్ చేసారు.

మా అధ్యక్ష ఎన్నికల గురించి చాలామంది సినీ సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పోటీలో నిలబడిన మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌లలో ఎవరి మద్దతు ఎవరికో స్పష్టం చేసారు. కానీ మురళీ మోహన్ మాత్రం దీనిగురించి మొదటి నుండి ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు.. ఇద్దరూ మా అధ్యక్ష పోటీకి సమర్థులే అన్నారు.

మా ఎన్నికలను ఏకగ్రీవం చేయాలనుకున్నా కుదరలేదని మురళీ మోహన్ అన్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో లోకల్, నాన్ లోకల్ అనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. అది తగ్గాలంటే అగ్ర హీరోలే ఈ బాధ్యతను తమ భుజాలపై వేసుకోవాలని ఆయన తెలిపారు. విష్ణు, ప్రకాశ్ రాజ్‌లలో ఎవరు గెలిచినా అసోసియేషన్ భవన నిర్మాణాన్ని చేపట్టడంతో పాటు సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని మురళీమోహన్ కోరారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES