Mahesh Babu : థియేటర్స్ లో మురారి పూనకాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ గా రీ రిలీజ్ అయింది మురారి. మహేష్ బాబుకు సోలోగా ఫస్ట్ హిట్ ఈ మూవీనే చెబుతారు. కాస్త ఫాంటసీ మిక్స్ అయిన బ్యూటీఫుల్ ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీగా ఈ మూవీకి అప్పట్లోనే విపరీతమైన అప్లాజ్ వచ్చింది. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మహేష్, సోనాలి బెంద్రేల మధ్య కెమిస్ట్రీ చాలా బ్యూటీఫుల్ గా ఉంటుంది. మనకూ ఇలాంటి మరదలో, బావో ఉంటే బావుణ్ను అనిపిస్తుంది. అయితే ఈ జెనరేషన్ ఆడియన్స్ కు ఈ మూవీ గురించి పెద్దగా తెలియదు. అయినా మహేష్ ఫ్యాన్స్ గా థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అయిపోయారు. రికార్డ్ స్థాయిలో బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్ జరిగిందీ మూవీకి. మురారి దెబ్బకు ఈ శుక్రవారం విడుదలైన 9 సినిమాలను గురించి పట్టించుకున్నవాళ్లు కూడా లేరు అంటే మురారి ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఇక మురారి రిలీజ్ అయిన అన్ని థియేటర్స్ పూనకాలతో ఊగిపోతున్నాయి. యూత్.. ముఖ్యంగా మహిళా అభిమానులు డ్యాన్స్ లు చేయడం.. హారతులు ఇవ్వడం చేస్తున్నారు. ఓ జంట అయితే ఏకంగా థియేటర్ లోనే పెళ్లి చేసుకుని మహేష్ పై అభిమానాన్ని చాటుకున్నారు. యంగ్ స్టర్స్ తో పాటు ఈ మూవీ వచ్చిన టైమ్ లోని యంగ్ స్టర్స్ కూడా థియేటర్స్ కు పరుగులు పెడుతున్నారు. విశేషం ఏంటంటే.. మురారికి ఇక్కడే కాదు.. విదేశాల్లో సైతం ఇదే స్థాయిలో హంగామా కనిపిస్తోంది.
ఇక బాబు బర్త్ డే అంటూ థియేటర్స్ లోని కటౌట్స్ వద్ద కేట్ కటింగ్ లు, పాలాభిషేకాలు.. కొన్ని చోట్ల బీరా(బీర్) భిషేకాలు కూడా జరుగుతున్నాయి. ఓ రకంగా మహేష్ బాబు బర్త్ ఇంత గ్రాండ్ గా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరుపుకోలేదు అభిమానులు అనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com