Mahesh Babu : మురారి.. నైజాంలో రికార్డ్..

మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ గా రీ రిలీజ్ అయిన మురారి మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఫస్ట్ డే ఈ మూవీకి నైజాం లో ఆల్ టైమ్ రికార్డ్ అనే రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి. మామూలుగా నైజాం ఏరియాలో మాస్ మూవీస్ కు ఎక్కువ ఆదరణ ఉంటుంది. అలాంటిది క్లాస్ మూవీ అయిన మురారి ఆల్ టైమ్ రికార్డ్ అనే స్థాయిలో ఏకంగా 2.90 కోట్లు వసూలు చేసింద. ఇప్పటి వరకూ రీ రిలీజ్ అయిన ఏ స్టార్ హీరో సినిమా కూడా ఈ మొదటి రోజు ఈ ఫిగర్స్ సాధించలేదు. ఒక నైజాంలోనే కాదు.. ఓవరాల్ గా కూడా మురారి అదరగొట్టింది.
వాల్డ్ వైడ్ గా ఫస్ట్ డే మురారి 4 కోట్లు గ్రాస్ సాధించిందని అంచనా. ఓ రకంగా మహేష్ కు ఇది స్పెషల్ బర్త్ డే గిఫ్ట్ అనే చెప్పాలి. యంగ్ స్టర్స్ అంతా థియేటర్స్ లో నానా హంగామా చేస్తున్నారు. వయో భేదం లేకుండా డ్యాన్స్ లు చేస్తూ థియేటర్స్ లోనే కేక్ లు కట్ చేసి మహేష్ బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాన్స్. రిలీజ్ కు ముందే బుక మై షో, అడ్వాన్స్ బుకింగ్స్ తోనూ రికార్డ్ సృష్టించిన మురారి రిలీజ్ తర్వాత కలెక్షన్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. మరి ఓవరాల్ గా ఈ ఫిగర్స్ ఎక్కడి వరకూ వెళతాయో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com