pawan: పవన్‌కల్యాణ్ ఓ ఆరని కార్చిచ్చు: కీరవాణి

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `హరిహర వీరమల్లు`. ఈ సినిమా నుంచి మూడో పాట `అసుర హననం`**ను విడుదల చేశారు. `అసుర హననం` అంటూ సాగే ఈ పాటని భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ పాత్ర తీరుతెన్నులను, ఆయన హీరోయిజాన్ని ఆవిష్కరించేలా ఈ పాట సాగడం విశేషం. యోధుడిగా ఆయన్ని ఈ పాటలో చూపించిన తీరు అదిరిపోయింది. సినిమా కాన్సెప్ట్ ని కూడా ఇందులో చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. రాజులు ప్రజలను చిత్ర హింసలు పెడుతుండగా, వారిని ఎదురించి, అమాయక జనం కోసం పోరాడే పాత్రలో పవన్ కనిపిస్తున్నట్టుగా ఈ పాటలో చూపించారు. ఇది పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది. సినిమాో కథలో భాగంగా ఈ పాట వస్తుందని అర్థమవుతుంది.**
రోమాలు నిక్కబొడిచేలా కీరవాణి సంగీతం
`అసుర హననం`** పాటకి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. రాంబాబు గోశాల ఈ పాటని రాయడం విశేషం. యోధుడి వీరత్వాన్ని చాటిచెప్పేలా సంగీతం, సాహిత్యం ఉన్నాయి. శ్రోతలలో పోరాట స్ఫూర్తిని రగిల్చేలా శక్తివంతంగా కీరవాణి సంగీతం ఉండటం విశేషం. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోనూ ఈ పాటని ఏక కాలంలో విడుదల చేశారు. పాట విడుదల సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ.. ఈ సినిమా రూపంలో ఎ.ఎం. రత్నం గారికి మరో భారీ విజయం సొంతం అవుతుందని విశ్వసిస్తున్నానని తెలిపారు.**
పవన్ ఓ కార్చిచు
పవన్ కళ్యాణ్ ని మీరందరూ పవర్ స్టార్ అంటారు నేను మాత్రం మూర్తీభవించిన ధర్మాగ్రహం అంటానని కీరవాణి అన్నారు. ఆగ్రహం మనందరికీ వస్తుంది. కానీ సమాజం కోసం వచ్చేది ధర్మాగ్రహం. ఆయనకు మాత్రమే సరిపోయేలా 'హరి హర వీరమల్లు'ను తీర్చిదిద్దారని కీరవాణి తెలిపారు. జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోయే కార్చిచ్చు పవన్ కళ్యాణ్ అన్నారు. కార్చిచ్చు మీద ఎంత వాన పడినా అది ఆగదని.. ఆయనతో మొదటిసారి చేస్తున్న సినిమా కాబట్టి ఎంతో శ్రద్ధతో చేశాను` అని తెలిపారు కీరవాణి. **`హరి హర వీరమల్లు`** సినిమా తయారవ్వడానికి ముఖ్యకారణం పవన్ కళ్యాణ్. క్రిష్ చెప్పిన కథ నచ్చి, పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకెళ్ళాను. రత్నం జడ్జిమెంట్ ను నమ్మి ఈ సినిమా చేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యమైంది. నా కుమారుడు అని చెప్పడం కాదు.. జ్యోతికృష్ణ ఈ సినిమా బాధ్యతను తీసుకొని ఎంతో కష్టపడి పని చేశాడు.” అని నిర్మాత ఏఎం రత్నం వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com