Thaman : ఫ్యాన్స్ గెట్ రెడీ.. భీమ్లానాయక్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తమన్..!

Thaman : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన భీమ్లానాయక్ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి త్రివిక్రమ్ కథనం, మాటలు అందించారు. సితార ఎంటర్‌టైన్మెంట్ పై రూపొందిన ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించగా మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించాడు. కలెక్షన్లతో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది ఈ మూవీ. అయితే ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చాడు తమన్.. భీమ్లానాయక ర్యాప్ సాంగ్ వచ్చేస్తోందని బాణసంచా కాల్చేందుకు అభిమానులు రెడీగా ఉండాలంటూ ట్వీట్ చేశాడు. మూవీలోని క్లైమాక్స్ ర్యాప్ సాంగ్‌ను విడుదల చేయాలనీ అభిమానులు కోరుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ ర్యాప్ సాంగ్ పైన తమన్ స్పందించాడు.
#BheemlaBackOnDuty !! 🍭🧿 #TheRapSong 💥💥💥💥💥💥💥 Get ready for Fireworks guys #BlockBusterBheemlaNayak 💥💥💥💥 pic.twitter.com/6i7UzlcFLf
— thaman S (@MusicThaman) March 4, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com