AR Rahman's mother : ఏఆర్‌ రెహమాన్‌ ఇంట్లో విషాదం!

AR Rahmans mother : ఏఆర్‌ రెహమాన్‌ ఇంట్లో విషాదం!
మ్యూజిక్ సెన్సేషన్ ఏ.ఆర్ రెహమాన్ ఇంట్లో విషాదం నెలకొంది. రెహమాన్ తల్లి కరీమా బేగం ఈ రోజు ఉదయం మరణించారు. దీనితో రెహమాన్ ఇంట్లో విషాదం నెలకొంది.

మ్యూజిక్ సెన్సేషన్ ఏ.ఆర్ రెహమాన్ ఇంట్లో విషాదం నెలకొంది. రెహమాన్ తల్లి కరీమా బేగం ఈ రోజు ఉదయం మరణించారు. దీనితో రెహమాన్ ఇంట్లో విషాదం నెలకొంది. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలో కన్నుమూశారు. ఆమె దహన సంస్కారాలు రేపు జరగనున్నాయి. కరీమా బేగానికి నలుగురు సంతానం కాగా, వీరిలో ఏఆర్‌ రెహమాన్‌ చిన్నవాడు.

ఇక కరీమా భర్త ఆర్‌కే శేఖర్‌ రెహమాన్‌.. అయన రెహమాన్‌ తొమ్మిదేళ్ల వయస్సులో ఉన్నప్పుడే మరణించారు. ఏఆర్ రెహమాన్ సంగీత రంగంలో బాగా రాణించడానికి ఆమె ఎంతో కృషి చేశారు. ఈ విషయాన్ని రెహమాన్ చాలా సందర్భాలలో కూడా చెప్పారు. ఇక ఆమె మృతి పట్ల చిత్ర పరిశ్రమ రెహమాన్ మరియు అతని కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తుంది.

Tags

Next Story