నా డార్లింగ్, నా జీవితం: అమ్మ గురించి ఆరాధ్య

నా డార్లింగ్, నా జీవితం: అమ్మ గురించి ఆరాధ్య
మిస్ ఇండియా ఐశ్వర్యారాయ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. తల్లి అయ్యాక తన సినిమా కెరిర్ ని కొంచెం తగ్గించుకున్నా అప్పుడప్పుడూ నచ్చిన పాత్రలు వస్తే చేస్తోంది.

మిస్ ఇండియా ఐశ్వర్యారాయ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. తల్లి అయ్యాక తన సినిమా కెరిర్ ని కొంచెం తగ్గించుకున్నా అప్పుడప్పుడూ నచ్చిన పాత్రలు వస్తే చేస్తోంది. తన వేలు పట్టుకుని నడిపించిన కూతురు నవంబర్ 1న ఐశ్వర్య పుట్టిన రోజు సందర్భంగా అమ్మ గురించి నాలుగు ఆణిముత్యాలను ప్రసంగించింది. మొదటిసారి మైక్ పట్టుకున్న ఆరాధ్య అమ్మని అభినందిస్తూ ప్రసంగించింది.

ఎప్పడూ ఆమ్మచాటు బిడ్డగా ఎదిగిన ఆరాధ్య ఈరోజు మొదటిసారిగా పబ్లిక్ లో ప్రసంగించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నవంబర్ 1, బుధవారం నాడు ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన 50వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ ప్రత్యేక రోజును పురస్కరించుకుని, బాలీవుడ్ సూపర్ స్టార్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్, తల్లి బృందా రాయ్‌తో కలిసి క్యాన్సర్ రోగుల సంక్షేమం కోసం నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఆరాధ్య మైక్ తీసుకొని బహిరంగంగా మొదటిసారిగా కదిలించే ప్రసంగం చేసింది. ఆమె తన తల్లిపై ప్రశంసలు కురిపించింది.

ఐశ్వర్యరాయ్ ఎక్కడికి వెళ్లినా తన కూతురు ఆరాధ్యతో కలిసి ఉంటుంది. తెల్లటి చికంకారీ సల్వార్ సూట్‌లో ఐశ్వర్య చాలా అందంగా కనిపించింది. మీడియాకు ఎప్పుడూ దూరం ఉండే ఐశ్వర్య కూతురు తొలిసారి పబ్లిక్‌గా స్పీచ్ ఇచ్చింది.

“నా డార్లింగ్, నా జీవితం, మా అమ్మ చేస్తున్నది నిజంగా అద్భుతమైనదని నేను భావిస్తున్నాను. ఇది నిజంగా సంతృప్తికరమైనది. ప్రపంచానికి సహాయం చేస్తోంది, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేస్తుంది, ప్రజలకు సహాయం చేస్తుంది, అందుకే నేను అమ్మకు చెప్పాలనుకుంటున్నాను, మీరు చేస్తున్నది నిజంగా అద్భుతమైనది, ”అని ఆరాధ్య తన ప్రసంగంలో పేర్కొంది. ఆరాధ్య ప్రసంగిస్తున్నంతసేపు ఐశ్వర్య కూతురివంక ఆశ్చర్యంగా చూసింది.

ఐశ్వర్య చివరిగా హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'పొన్నియిన్ సెల్వన్: II'లో కనిపించింది. 2011లో ఐశ్వర్య రాయ్, అభిషేక్ దంపతులకు ఆరాధ్య జన్మించింది. నవంబర్ 16న ఆరాధ్యకు 12 ఏళ్లు నిండుతాయి.

Tags

Read MoreRead Less
Next Story