Anushka Sharma: సినిమాల కంటే వామికను చూసుకోవడమే ముఖ్యం: అనుష్క శర్మ
Anushka Sharma: అనుష్క శర్మ తన కుమార్తె వామిక పుట్టిన తర్వాత సినిమాలు తగ్గించుకుంది. ఇప్పుడు ఆమె చేతిలో ఒక ప్రాజెక్ట్ ఉంది. చక్దా ఎక్స్‌ప్రెస్‌లో నటిస్తోంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుంది. అనుష్క ఇటీవల వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. వామికతో సమయం గడపడం చాలా ఇష్టమని పేర్కొంది. చక్దా ఎక్స్‌ప్రెస్ షూట్ పూర్తి చేసిన తర్వాత, వామికతో సమయం గడుపుతాను. ఇంకేమీ చేయడానికి సమయం లేదని చెప్పుకొచ్చింది. తాను ఎక్కువ సినిమాలు చేయనని, తగిన ప్రాజెక్ట్‌లను మాత్రమే తీసుకుంటానని ఆమె పేర్కొంది. ఎక్కువ సినిమాలు చేయడానికి ఓకే అని, అయితే అయితే స్క్రిప్ట్ బాగా నచ్చితేనే చేస్తానని తెలిపింది. ఆఫర్‌లు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి టైమ్ వేస్ట్ చేసుకోనని తెలిపింది. సమయం చాలా విలువైంది. దానిని నా బిడ్డను చూసుకోవడానికి కేటాయిస్తాను అని తెలిపింది. “నేను దాని గురించి చాలా స్పష్టంగా ఉన్నాను”.
తన కుమార్తెపై ప్రేమ గురించి మాట్లాడుతూ, మీ పిల్లలతో అనుబంధాన్ని కలిగి ఉండటం ఎంత ముఖ్యమో చెప్పింది. అనుష్క శర్మ తల్లిగా గణనీయమైన త్యాగం చేసిందని విరాట్ కోహ్లీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. నా భార్య నాకు నిజమైన ప్రేరణ అని పేర్కొన్నాడు. ఒక తల్లిగా అనుష్క చేసిన త్యాగం చాలా పెద్దదని విరాట్ కోహ్లీ అన్నాడు. నా భార్యను చూస్తుంటే నాకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించుకోగలనని అర్థమైంది. క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం చక్దా ఎక్స్‌ప్రెస్. అనుష్క ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసింది. ఈ చిత్రం త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com