My Dear Bhootham Review : మై డియర్ భూతం.. పిల్లలతో పాటు పెద్దలను ఆకట్టుకుంది..

My Dear Bhootham Movie Review : అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం.. జినీ.. ఈ జానర్‌లో అనేక సినిమాలు వచ్చాయి. ఇప్పడు ప్రభుదేవ, మాస్టర్ అశ్వంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మై డియర్ భూతం కూడా అదే కాన్సెప్ట్‌కు చెందిందే. తమిల్ తెలుగు భాషల్లో ఈ సినిమా జులై 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. పదేళ్లలోపు పిల్లలను అలరించడంతో పాటు పెద్దల మనసులను కూడా టచ్ చేస్తుంది.
ఎన్ రాఘవన్ ఈ మూవీకి కథను రాయడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. రమేశ్ పి పిల్లయ్ అభిషేక్ ఫిలిమ బ్యానర్ పై నిర్మించారు. డి ఇమ్మన్ సంగీతాన్ని సమకూర్చగా యుకె సెంతిల్ కుమార్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు
కథ విషయానికి వస్తే.. సినిమా మొత్తం జిని (ప్రభుదేవ) తిరుణ (అశ్వంత్) చుట్టూ తిరుగుతుంటుంది. తండ్రిని కోల్పోయి అమ్మదగ్గరే ప్రేమగా పెరుగుతాడు తిరుణ. అయితే అతనికి నత్తి ఉంటుంది. తన నత్తిపై స్కూల్లో, బయట, స్నేహితులు, టీచర్లు జోకులు వేస్తూ ఉంటారు. కొడుకును కోల్పోయిన జిని తిరుణలో తన కొడుకును చూసుకుంటాడు. ఇద్దరూ కలిసి చేసే అల్లరి వింతలు పిల్లలను బాగా ఆకట్టుకుంటాయి.
పిల్లలకు మంచి ఎంటర్టైన్మెంట్‌తో పాటు మంచి సందేశాన్ని దర్శకుడు ఎన్ రాఘవన్ ఈ సినిమా ద్వారా అందించారు. మూవీలో తిరుణపై అతని తల్లి అతిగారాబం ప్రేమ చూపుతుంది. ఇందులో పిల్లలని స్వేచ్చగా ఎలా వదలాలి అనే అంశాన్ని చక్కగా తెరకెక్కించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com