ఆయన మెగాస్టార్ కాదని అనుకుంటారు: అభిషేక్ బచ్చన్

ఆయన మెగాస్టార్ కాదని అనుకుంటారు: అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ “జూమర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ “జూమర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఒక బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, అభిషేక్ బచ్చన్ తన తండ్రి పని చేసే విధానాన్ని ప్రశంసించాడు. అది నెటిజన్ల నుండి కూడా ప్రశంసలు పొందుతోంది.

“రెండు నెలల్లో నాన్నకి 81 ఏళ్లు రాబోతున్నాయి. ఆయన ఇప్పటికే చాలా విజయాలు సాధించారు. కానీ అతను అందరూ అనుకున్నట్లు లేదా రాస్తున్నట్లు మెగాస్టార్ లేదా సూపర్‌స్టార్ కాదని ఇప్పటికీ అనిపిస్తుంది. ప్రతి ఆదివారం వేల మంది వచ్చి తనను పలకరించినా, ఈ వారం కష్టపడకపోతే వచ్చే వారం మీ ముందుకు రాకపోవచ్చని అంటారు. అందుకే ఈ వయసులో కూడా వారానికి 6 రోజులు పని చేస్తున్నారు” అని అభిషేక్ చెప్పారు.

కౌన్ బనేగా కరోడ్‌పతి కోసం తన తండ్రి ఎలా కష్టపడుతుంటారో వివరించారు అభిషేక్. "ఆయన గత 20 సంవత్సరాలుగా KBC చేస్తున్నారు. కానీ అతను ఇప్పటికీ ఉదయం 8 గంటలకల్లా సెట్‌లో ఉండి తన లైన్లను రిహార్సల్ చేస్తారు. షూటింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఓ రోజు నేను నాన్నని అడిగాను.. చాలా కాలం నుంచి ఈ షో చేస్తున్నారు కదా.. ఇంకా ఎందుకు రిహార్సల్స్ చేస్తారు అని .. దానికి ఆయన స్పష్టంగా సమాధానం చెప్పారు. "నేను షో టీమ్ ఇచ్చిన స్క్రిప్ట్ ని ఏ సమయంలోనూ తప్పుగా చెప్పకూడదు అని అన్నారు.

అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, చిరంజీవి లాంటి వారు ఆ రకమైన అంకితభావం వల్లనే నేటికీ టాప్‌ స్టార్‌లుగా ఉన్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం, కష్టించే తత్వం ఉండడం వల్లనే ఇన్నేళ్లయినా ప్రేక్షకులు వారిని తమ గుండెల్లో పెట్టుకుంటారు.

Tags

Read MoreRead Less
Next Story