ఆమెని మొదటి సారి చూసినప్పుడే ప్రేమలో పడిపోయా: వైష్ణవ్ తేజ్

ఆమెని మొదటి సారి చూసినప్పుడే ప్రేమలో పడిపోయా: వైష్ణవ్ తేజ్
నటించిన మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు వైష్ణవ్ తేజ్.

నటించిన మొదటి సినిమాతోనే సంచలనం క్రియేట్ చేశాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన హిట్‌తో మరిన్ని అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటీవల మీడియాతో మాట్లాడిన వైష్ణవ్ తనకు బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా అంటే చాలా ఇష్టమని, ఆమెని మొదటి సారి చూసినప్పుడే ప్రేమలో పడిపోయానని చెప్పారు. ఎవరినైనా ప్రేమించి విడిపోవడం అంటే చాలా బాధాకరం అని మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని అంటూ ఇష్టమైన క్రికెటర్ ధోనీ అని తెలిపారు.

అభిమాన హీరో రజనీ కాంత్ అని, ఆయన నటించిన శివాజీ మూవీని చాలా సార్లు చూశానని చెప్పారు. తన తరువాతి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నానని అన్నారు. గిరీశయ్య దర్శకత్వంలో మరో సినిమా పట్టాలెక్కనుందని తెలిపారు. మీ కో స్టార్ కృతి శెట్టిలో నటన కాకుండా దాగి ఉన్న మరో టాలెంట్ ఏమిటి అని అడిగితే.. ఆమె బాగా పాడుతుందని తెలిపారు. ఇక ఫ్యామిలీ మేన్ 2 లో సమంత నటన హైలెట్ అని చెప్పారు. స్ఫూర్తినిచ్చే నటుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story