Bhagyashri Borse : నా జర్నీ ఇప్పుడే మొదలైంది : భాగ్యశ్రీ బోర్సే

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్లలో భాగ్యశ్రీ బోర్సే ముందు వరుసలో ఉంది. ఇటీవల ‘మిస్టర్ బచ్చన్’మూవీతో ఆకట్టుకున్న భాగ్యశ్రీ.. ఆ మూవీ రిలీజ్ కు ముందే విజయదేవరకొండ సినిమాలో చాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. మిస్టర్ బచ్చన్ లో భాగ్య శ్రీ అందాలకు, డ్యాన్స్ లకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. తనను ఆదరించిన టాలీవుడ్ ఆడియెన్స్ కు థ్యాంక్స్ చెబుతూ ఇన్ స్టాగ్రామ్ లో భాగ్యశ్రీ ఓ పోస్ట్ పెట్టింది. ‘నన్ను మీ ఇంటి మనిషిగా ఆదరించినందుకు థ్యాంక్స్. జిక్కీ పాత్రపై మీరు చూపిన ప్రేమాభిమానాలు ఊహించలేదు. నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నా తర్వాతి ప్రాజెక్ట్‌ల గురించి మీతో పంచుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తా’అని రాసుకొచ్చారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా రానున్న ‘వీడీ12’లో భాగ్యశ్రీ నటించనుంది. ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగుతోంది. దీంతో పాటు మలయాళ స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ సినిమాకు భాగ్యశ్రీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కునున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com