Kangana Ranaut : నా విప్లవ భావజాలం ఆర్‌ఎస్‌ఎస్‌తో సరిపోలుతుంది

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) పనితీరును బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కొనియాడారు, ఆ సంస్థ దేశం కోసం చాలా చేసిందని, అందర్నీ ఏకం చేయడానికి ఇప్పటికీ కృషి చేస్తుందని అన్నారు. "నా విప్లవ భావజాలం ఆర్‌ఎస్‌ఎస్‌తో సరిపోలుతోంది. అందువల్ల ఈ దేశభక్తి సంస్థ పనితో నేను ఆకట్టుకున్నాను" అని ఆమె ఓ కార్యక్రమంలో అన్నారు.
అధికార బీజేపీ సైద్ధాంతిక మూలాధారమైన ఆర్‌ఎస్‌ఎస్ దేశాన్ని ఏకం చేసేందుకు కృషి చేసిందని, దాని ద్వారా శిక్షణ పొందిన వ్యక్తులు అధికారంలోకి వచ్చాక 70 ఏళ్లలో చేయలేని పనిని కేవలం 8 నుంచి 10 ఏళ్లలో పూర్తి చేశారని రనౌత్ అన్నారు. "నా చిన్నతనంలో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరే అర్హత నాకు లేదు" అని రనౌత్ అన్నారు. ఆమె చాలా కాలంగా సంస్థ గురించి ఆసక్తిగా ఉంది. గత సంవత్సరం, సిమ్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో, కంగనా బీజేపీ కోరుకుంటే మండి లోక్‌సభ స్థానం నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేసింది.
ఇటీవల కంగనా రనౌత్ కొత్త తమిళ మూవీ సెట్స్‌లో అనుకోని అతిథి సందడి చేశాడు. ఆ అతిథి మరెవరో కాదు రజనీకాంత్. తలైవర్ రజనీకాంత్ తనకు ఇచ్చిన స్వీట్ సర్‌ప్రైజ్ గురించి ట్విట్టర్ ద్వారా కంగనా రనౌత్ అభిమానులతో పంచుకున్నది. కంగనా రనౌత్, మాధవన్ కాంబినేషన్‌లో ఓ తమిళ మూవీ శనివారం ప్రారంభమైంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తలైవి ఫేమ్ ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తోన్నాడు. శనివారం పూజా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు షూటింగ్‌ను మొదలుపెట్టారు. ఈ మూవీ సెట్స్‌ను రజనీకాంత్ విజిట్ చేశాడు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రజనీ కాంత్ తమ సెట్స్‌కు రావడంతో కంగనా రనౌత్, ఏఎల్ విజయ్‌తో పాటు యూనిట్ మొత్తం షాకయ్యారట.
గాడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రజనీకాంత్ సర్‌ప్రైజ్ విజిట్‌తో థ్రిల్లింగ్‌గా ఫీలైనట్లు కంగనా రనౌత్ ట్విట్టర్‌లో పేర్కొన్నది. రజనీకాంత్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఈ సంతోషకర సమయంలో మాధవన్ లేకపోవడం బాధను కలిగిచిందని కంగనా రనౌత్ తెలిపింది. త్వరలోనే మాధవన్ ఈ సినిమా షూటింగ్‌లో భాగం కాబోతున్నట్లు కంగనా తన ట్వీట్‌లో పేర్కొన్నది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com