బెల్లంకొండ శ్రీనివాస్ మిస్టరీస్ ఏంటీ

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్నాడు. ఇప్పటి వరకూ కెరీర్ లో జయ జానకి నాయక, రాక్షసుడు చిత్రాలు మాత్రమే విజయం సాధించాయి. ఆ మధ్య తెలుగు ఛత్రపతిని హిందీలో రీమేక్ చేసి భంగ పడిన తర్వాత మళ్లీ తెలుగుపైనే ఫోకస్ చేశాడు. ప్రస్తుతం టైసన్ నాయుడుతో పాటు మరో సినిమాకు కమిట్ అయిన శ్రీనివాస్ నుంచి మరో ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. దివంగత గ్రేట్ డైరెక్టర్ కోడి రామకృష్ణ జయంతి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
లుధీర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని మహేష్ చందు నిర్మిస్తున్నాడు. ఈ పోస్టర్ తో పాటు అనేక రహస్యాలతో నిండి ఉన్న లోకంలో జరిగే సాహసాలు చూడ్డానికి రెడీగా ఉండండి అనే క్యాప్షన్ కూడా ఉంది. ఓ రకంగా మైథలాజికల్ ఫిక్షన్ లా కనిపిస్తోన్న ఈ మూవీని ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే రూపొందించబోతున్నారు. శ్రీనివాస్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించబోతోంది. మొత్తంగా కొన్నాళ్లుగా వస్తోన్న ఫ్లాపులను సమీక్షించుకున్న సాయి శ్రీనివాస్ సరైన కథల కోసం ఎదురు చూసి అన్ని విధాలా నచ్చితేనే ఓకే చెబుతున్నాడు. మరి టైసన్ నాయుడు తర్వాత రాబోతోన్న ఈ యాక్షన్ ఎడ్వెంచరస్ మూవీ ఎలా ఉంటుందో..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com