Sri Tej : రేవతి కుటుంబానికి మైత్రీ 50లక్షల సాయం

Sri Tej :  రేవతి కుటుంబానికి మైత్రీ 50లక్షల సాయం
X

ఈ నెల 4న పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబం చుట్టూ తెలంగాణ రాజకీయం సాగుతోంది. ఆమె కొడుకు శ్రీతేజ్ ఇంకా ప్రాణాపాయ స్థితిలోనే హాస్పిటల్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణలో మంటలు రేపుతోంది. ముఖ్యంగా ప్రమాదం జరిగిన వెంటనే హీరో, నిర్మాతలు వెళ్లి కలవలేదు అనేది సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన విమర్శ. విషయం అసెంబ్లీలోనూ హాట్ గా మారడంతో తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యొర్నేని, రవి శంకర్ యలమంచిలి కోమటిరెడ్డితో కలిసి హాస్పిటల్ లో శ్రీ తేజ్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా బాబు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఆ బాబు తండ్రి భాస్కర్ కు 50 లక్షల రూపాయల చెక్ ను అందించారు.

అలాగే ఇకపై ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని.. హీరోపై దాడులు చేయొద్దని కోరారు.

Tags

Next Story