Jai Hanu Man : జై హను మాన్ తో ‘మైత్రి’ కుదిరింది

Jai Hanu Man :  జై హను మాన్ తో ‘మైత్రి’ కుదిరింది
X

హనుమాన్ మూవీతో ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ద విజయం సాధించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. లిమిటెడ్ బడ్జెట్ తో అద్భుతమైన విజయం సాధించిన ఈ మూవీలోని విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కు చాలామంది షాక్ అయ్యారు. అంత బెస్ట్ క్వాలిటీతో ఉన్నాయి. ఈ మూవీతో ప్రశాంత్ వర్మతో పాటు హీరో తేజ సజ్జా కూడా ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అయిపోయారు. హను మాన్ క్లైమాక్స్ తో మరో పార్ట్ కూడా ఉందనే విషయాన్ని క్లియర్ గా చెప్పాడు. ఆ పార్ట్ అంతా హైలెట్ గా పిక్చరైజ్ చేశాడు ప్రశాంత్. దీంతో సీక్వెల్ కోసం ఎవరిని తీసుకోబోతున్నారా అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. అది కూడా తేలిపోయింది.

కాంతారతో ప్యాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రిషబ్ శెట్టి జై హను మాన్ లో హీరోగా నటించబోతున్నాడు. ఈ దీపావళి సందర్భంగా ఈ మంగళవారం జై హను మాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సారి ప్రొడక్షన్ లోకి మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఎంటర్ అయ్యారు. ప్రశాంత్ సినీ వర్స్ గా చెప్పుకుంటోన్న ఈ టీమ్ లోకి మైత్రీ బ్యానర్ ఎంటర్ అయిందీ అంటే ఖచ్చితంగా మరింత బెస్ట్ క్వాలిటీ రాబోతోందనే అర్థం. మరి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు షూటింగ్ కు సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తాయని ఎక్స్ పెక్ట్ చేయొచ్చా..?

Tags

Next Story