Raviteja : ఆటోగ్రాఫ్.. సౌండ్ ఏదీ..?

Raviteja :  ఆటోగ్రాఫ్.. సౌండ్ ఏదీ..?
X

మాస్ మహారాజ్ రవితేజ వైవిధ్యమైన కథలు ఎందుకు చేయడు అంటే ఇదుగో ఇందుకు అంటూ తన కొన్ని సినిమాలు ఉదాహరణలుగా చెప్పేవాడు. అతను చేసిన ఆ డిఫరెంట్ మూవీస్ అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో అతను కొత్తదనం ఉండే కథలు చేయడం మానేశాడు. అతను చెప్పేలాంటి మూవీస్ లిస్ట్ లో ఉండే సినిమా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. తమిళ్ లో చేరన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి దర్శకత్వంలో రీమేక్ చేశారు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. రవితేజ, గోపిక, భూమిక, మల్లిక, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు. తెలుగులో ప్రతి పాటా సూపర్ హిట్ అయింది.

ఒక వ్యక్తి చిన్నతనం నుంచి పెళ్లి వరకూ తన జీవితంలో జరిగిన జ్ఞాపకాల కలబోత ఈ చిత్రం. టీనేజ్ లవ్ నుంచి కాలేజ్ లో సిన్సియర్ లవ్ స్టోరీ దాటుకుని డిప్రెషన్ కు వెళ్లి, మరో లేడీ సాయంతో జీవితంలో ఉన్నత శిఖరాలను చేరి.. ప్రేయసిని మర్చిపోలేకున్నా మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమవుతాడు. చిన్నతనంలో తన లైఫ్ లో ఇంపార్టెంట్ అనుకున్న ప్రతి ఒక్కరినీ పెళ్లికి ఆహ్వానించడం ఆ క్రమంలో వారితో తనకున్న స్వీట్ మెమరీస్ ను గుర్తు చేసుకుంటూ సాగే కథనం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయింది. కాకపోతే కమర్షియల్ గా ఈ సినిమా ఆడలేదు. డబ్బులు రాలేదు. ఇది రవితేజను బాగా డిజప్పాయింట్ చేసింది. కానీ టివిల్లో ఎప్పుడు వచ్చినా అతుక్కుపోయి చూస్తారు జనం. అదే చిత్రం.

అందుకే ఈ సినిమాను ఈ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల చేస్తున్నారు. కానీ ఎక్కడా దానికి సంబంధించిన సౌండేం వినిపించడం లేదు. పైగా ఈ వాలెంటైన్స్ డేకి చాలా పాత సినిమాలు వస్తున్నాయి. వాటిలో ఇట్స్ కాంప్లికేటెడ్( కృష్ణ అండ్ హిజ్ లీల) మాత్రమే పెద్ద ప్రమోషన్స్ తో వస్తోంది. ఒక్క ఆటోగ్రాఫ్ కే కాదు మిగతా సినిమాలకూ పెద్ద సౌండేం లేదు.

Tags

Next Story