RRR Movie: 'ఆర్ఆర్ఆర్' నుండి అందరికీ నచ్చే వీడియో సాంగ్ వచ్చేసిందిగా..!

RRR Movie: ఆర్ఆర్ఆర్ నుండి అందరికీ నచ్చే వీడియో సాంగ్ వచ్చేసిందిగా..!
RRR Movie: యాక్టింగ్ విషయంలోనే కాదు డ్యాన్స్ విషయంలో కూడా ఎన్‌టీఆర్, రామ్ చరణ్ వారికి వారే సాటి అనిపించుకున్నారు.

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం తగ్గేదే లే అంటోంది. ఇప్పటికే ఈ మూవీ 1000 కోట్ల మార్క్‌ను తాకి అందరినీ ఆశ్చర్యపరిచింది. బాహుబలితో తొలి పాన్ ఇండియా హిట్ కొట్టిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌తో మరోసారి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి అందరికీ నచ్చే వీడియో సాంగ్ ఒకటి విడుదలయ్యింది.

ఆర్ఆర్ఆర్‌లో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ పోటాపోటీగా నటించారు. ఎవరి యాక్టింగ్ బెస్ట్ అని చెప్పుకోలేనంతగా వారి నటనతో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు. యాక్టింగ్ విషయంలోనే కాదు డ్యాన్స్ విషయంలో కూడా వారికి వారే సాటి అనిపించుకున్నారు. ఇక వీరిద్దరు కలిసి స్టెప్పులేసిన నాటు నాటు పాట.. లిరికల్ వీడియో విడుదలయినప్పటి నుండి సోషల్ మీడియాలో తెగ పాపులారిటీని సంపాదించుకుంది.

నాటు నాటు లిరికల్ వీడియోలో రామ్ చరణ్, ఎన్‌టీఆర్ డ్యాన్స్ ఎలా ఉంటుందో చిన్న శాంపుల్ చూపించారు. కానీ సినిమా చూసిన తర్వాత పాటలో ఇంకా చాలా మ్యాటర్ ఉందని ప్రేక్షకులకు అర్థమయ్యింది. ఇక ఈ హీరోలతో పాటు ఒలివియా కూడా తన క్యూట్ యాక్టింగ్‌తో ఈ పాటకు గ్లామర్ యాడ్ చేసింది. ఇక తాజాగా ఈ నాటు నాటు పాట ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యి వ్యూస్ విషయంలో దూసుకుపోతోంది.

Tags

Next Story