Nabha Natesh : ప్రిన్సెస్ పాత్రలో నభా నటేశ్

ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా టాలీవుడ్ కు దగ్గరైన నటి సభా నటేశ్. ఆ తర్వాత 'డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్' వంటి సినిమాల్లోనూ తన ప్రతిభను నిరూపించుకుంది. ఓ ప్రమాదం కారణంగా ఆమె రెండేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆపరేషన్ కూడా చేయించుకున్న నభా పూర్తిగా కోలుకుంది. ఇటీవలే 'డార్లింగ్' అనే సినిమాలో ప్రియదర్శి సరసన నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలున్నాయి. డార్లింగ్ సినిమాలో సిట్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్యతో బాధపడుతున్న యువతిగా నభా కనిపించింది. ఈ సినిమాలో ఆమె చేసిన పాత్రకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన నభా, తన గ్లామరస్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంది. పువ్వు ఆకారంలో ఉన్న పొట్టి డ్రెస్ సింపుల్ మేకప్తో వచ్చిన నభా, ఫ్యాన్స్ ను కట్టిపడేసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నభా నటేశ్ నిఖిల్ సరసన 'స్వయంభూ' మూవీలో కూడా నటిస్తోంది. పీరియాడిక్ జోనర్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రిన్సెస్ పాత్రలో కనిపించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com