Sarkaru vaari paata : మహేష్, నదియా.. 34 ఏళ్ల తర్వాత..!

Sarkaru vaari paata : మహేష్, నదియా.. 34 ఏళ్ల తర్వాత..!
X
Sarkaru vaari paata : సరిలేరు నీకెవ్వరు లాంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు నటించిన మూవీ సర్కారు వారి పాట..

Sarkaru vaari paata: సరిలేరు నీకెవ్వరు లాంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు నటించిన మూవీ సర్కారు వారి పాట.. కరోనా వలన పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ రోజు(మే 12)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పరుశురాం డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ కలిసి సంయుక్తంగా నిర్మించగా తమన్ సంగీతం అందించాడు.

అయితే ఈ సినిమాలో నదియా ఓ కీలకమైన పాత్ర పోషించింది. మహేష్ తో నటించడం ఆమెకి ఇది రెండోసారి కావడం విశేషం. మ‌హేశ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా, ఆయన అన్నయ్య రమేష్ బాబు నటించిన బజారు రౌడీ చిత్రంలో నదియా హీరోయిన్ గా నటించింది..ఇందులో అమెది డ్యూయల్ రోల్. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 1988 లో వచ్చి సూపర్ హిట్ అయింది. మళ్ళీ ఇన్నాళ్ళకి మహేష్, నదియా కలిసి నటిస్తున్నారు.

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే బజారు రౌడీ, సర్కారు వారి పాట ఈ రెండు చిత్రాలలో మహేష్ పేరు మహేష్ కావడం.

Tags

Next Story