Nagarjuna : అఖిల్ పెళ్లి ఇప్పుడే కాదట

అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నాగ చైతన్య రెండో పెళ్లి డిసెంబర్ 4న జరగబోతోంది. సమంతతో విడాకులు తర్వాత ఎక్కువ టైమ్ తీసుకోకుండానే అతను నటి శోభిత ధూళిపాలతో ప్రేమలో పడ్డాడు. వీరి పెళ్లికి పెద్దల అంగీకారం కూడా ఉంది. శోభిత తెలుగు అమ్మాయి. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా నటించింది. ఇటు తెలుగు మూవీస్ లోనూ మెప్పించింది. వీరి పెళ్లి గురించి చాలాకాలంగా రూమర్స్ ఉన్నాయి. వాటిని నిజం చేస్తూ ఆ మధ్య డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ చేశారు ఇరు కుటుంబాల పెద్దలు. ఫైనల్ ఇక పెళ్లికి సిద్ధం అనుకుంటోన్న టైమ్ లో మరోసారి అఖిల్ ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది.
నాగ చైతన్య- సమంత పెళ్లి టైమ్ లో కూడా అఖిల్ కు ఎంగేజ్మెంట్ అయింది. బట్ చాలా త్వరగా విడిపోయారు. ఇప్పుడు మళ్లీ చైతన్య పెళ్లికి సిద్ధమైన టైమ్ లో అఖిల్ తను ప్రేమించిన జైనాబ్ వ్యవహారం బయటపెట్టడం.. వీరి పెళ్లికీ పెద్దలు అంగీకరించడం అయిపోయింది. అయితే ఈ అన్నదమ్ముల పెళ్లి ఒకేసారి అవుతుందని భావించారు చాలామంది. బట్.. అఖిల్, జైనాబ్ ల పెళ్లికి ఇంకా టైమ్ ఉందట. వీరు 2025లో ఒక్కటవుతారు అని నాగార్జున లేటెస్ట్ గా ప్రకటించాడు. సో.. అఖిల్ కూడా 2024లోనే పెళ్లి చేసుకుంటాడు అనే రూమర్స్ కు ఇలా చెక్ పెట్టేశాడు నాగ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com