Naga Babu: వరుణ్ తేజ్ పెళ్లిపై తండ్రి నాగబాబు కామెంట్స్..

Naga Babu: ప్రస్తుతం టాలీవుడ్‌లో పెళ్లి కాని బ్రహ్మచారులు ఎంతోమంది ఉన్నారు. అయితే వీరందరూ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని వారి కుటుంబ సభ్యులకంటే ఎక్కువగా అభిమానులే ఎదురుచూస్తుంటారు. అలా టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో వరుణ్ తేజ్ కూడా ఒకడు. ఇదే విషయం తండ్రి నాగబాబును అడగగా ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా సమాధానం ఇస్తు్న్నాడు.
నాగబాబు వారసుడిగా సినిమాల్లోకి వచ్చాడు వరుణ్ తేజ్. తన మొదటి సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అవ్వకపోయినా.. యాక్టింగ్ విషయంలో మాత్రం వరుణ్‌కు ఫుల్ మార్కులే పడ్డాయి. పైగా ఫిట్‌నెస్ విషయంలో, పర్సనాలిటీ విషయంలో వరుణ్ ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ముఖ్యంగా 'గద్దలకొండ గణేష్' చిత్రం కోసం వరుణ్ తేజ్ మేక్ ఓవర్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రస్తుతం వరుణ్ నటిస్తున్న 'గని', 'ఎఫ్ 3'.. కొన్నిరోజుల వ్యవధిలోనే విడుదల కానున్నాయి. అయితే తాజాగా నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను పెట్టి అభిమానులతో మాట్లాడాడు. అందులో భాగంగా ఒకరు వరుణ్ తేజ్ పెళ్లి గురించి అడగగా.. తనను ట్యాగ్ చేసి తననే ఈ ప్రశ్నకు సమాధానం అడగమన్నాడు.
ఇంతకు ముందు కూడా పలుమార్లు వరుణ్ తేజ్ పెళ్లి గురించి ప్రశ్న నాగబాబుకు ఎదురయ్యింది. వాటన్నింటికి ఒక్కొక్కసారి ఒక్కొక్క సమాధానం ఇస్తూ వచ్చాడు నాగబాబు. ఒకసారేమో మంచి సంబంధాలు వస్తే వరుణ్‌కు పెళ్లి చేస్తానని, ఇంకొకసారి వరుణ్ ప్రేమ పెళ్లి చేసుకున్న తనకు పరవాలేదని చెప్పాడు నాగబాబు. అయితే కొన్నాళ్ల క్రితం వరుణ్ తేజ్, ఓ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నాడని, పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని రూమర్స్ వినిపించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com