Naga Chaitanya - Samantha : సమంత జ్ఞాపకం చెరపను అన్న నాగ చైతన్య

Naga Chaitanya - Samantha :  సమంత జ్ఞాపకం చెరపను అన్న నాగ చైతన్య
X

అక్కినేని నాగ చైతన్య, సమంత జంట గురించి పెళ్లికి ముందే ఎన్నో వార్తలు వచ్చాయి. వీరి పెళ్లి టాలీవుడ్ లోనే హైలెట్ అనిపించుకుంది. కంట్రీ మొత్తం మోస్ట్ లవబుల్ కపుల్ గా చెప్పుకున్నారు. పెళ్లి తర్వాత కూడా సమంత నటన కొనసాగించింది. ఆ మేరకు ఇద్దరి మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ చూసి చాలామంది ముచ్చటపడ్డారు. బట్ సడెన్ గా విడిపోతున్నాం అని ప్రకటించి షాక్ ఇచ్చారు. నాలుగేళ్ల పాటు సాగిన వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్ వేశారు. అయితే అప్పటికే సమంత తన రిబ్స్ పై నాగ చైతన్య గుర్తుగా ఓ టాటూ వేయించుకుంది. ఇటు చైతన్య కుడి చేతిపైన తమ పెళ్లి రోజును సూచించేలా మరో టాటూ వేసుకున్నాడు. విడాకులు తర్వాత చాలా కష్టపడి సమంత ఆ పచ్చ బొట్టు తీసేయించుకుంది. దీంతో చైతూ జ్ఞాపకాలను శాశ్వతంగా తొలగించుకుందనుకున్నారు.

ప్రస్తుతం నాగ చైతన్య మరో పెళ్లి సిద్ధమయ్యాడు. నటి శోభిత ధూళిపాలతో రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా అయింది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఇప్పుడు కొత్త భార్య వస్తుంది కాబట్టి ఆ పెళ్లినాటి జ్ఞాపకం ఉన్న టాటూ మేటర్ ఏంటీ అంటే... నాగ చైతన్య అది తొలగించను అన్నాడట. దీంతో వచ్చిన ప్రాబ్లమ్ ఏం లేదు. అది అలాగే ఉంటుందని చెప్పాడట. అంటే రెండో పెళ్లి తర్వాత కూడా మొదటి పెళ్లి తాలూకూ మెమరీని తనతో పాటే ఉంచుకుంటాడు. ఇన్ డైరెక్ట్ గా అది సమంత జ్ఞాపకమే కదా.. మరి దీని వెనక ఇంకేదైనా మేటర్ ఉందా అనేది చెప్పలేం కానీ.. కొత్త పెళ్లాం ఈ విషయంలో పోరు పెడితే అప్పుడూ అలాగే ఉంటాడా లేదా అనేది చూద్దాం.



Tags

Next Story