Naga Chaitanya : నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ పూర్తయింది..

Naga Chaitanya :   నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ పూర్తయింది..
X

అక్కినేని ఫ్యామిలీ ఆనందంలో ఉంది. ఇన్నాళ్లు రూమర్ గా ఉన్న న్యూస్ నిజం చేసుకుంది. అఫ్ కోర్స్ అది నిజం అని వారందరికీ తెలుసు. సమంతతో విడిపోయిన తర్వాత చైతన్య చాలాకాలం కామ్ గానే ఉన్నాడు. బట్ శోభితతో పరిచయం అతని లైఫ్ కే పార్టనర్ గా మార్చింది. ఈ ఇద్దరూ ఎప్పుడు ప్రేమలో పడ్డారు అన్న ఆరాలు ఇప్పుడు అక్కర్లేదు. ఇన్నాళ్లు కలిసి తమ జీవితాల గురించి తెలుసుకున్నారు. ఒకరి కోసం ఒకరు అనుకుని అన్నీ చూసుకునే జీవితంలో ఒక అడుగు ముందుకు వేశారు. ఈ అడుగు ఏడడుగులు గా మారేందుకు కొంత టైమ్ ఉంది. శోభిత తెనాలికి చెందిన అమ్మాయే. చైతన్య గురించి ఆమెకు తెలియనివంటూ ఏం ఉండవు. అందుకే రెండో పెళ్లి వాడే అయినా తన మనసుకు నచ్చాడు కాబట్టే మనువాడబోతోంది. ఇండస్ట్రీ అమ్మాయిలను ఇండస్ట్రీ వాళ్లు పెళ్లి చేసుకోవడం తక్కువ. అయినా చేసుకుంటున్నారంటే ఒకరిపై ఒకరికి ఓ స్పష్టమైన అవగాహన ఉన్నట్టే. కొన్నిసార్లు పెళ్లి తర్వాత మనస్ఫర్థలు రావడం సహజం. చైతన్యకు ఇంతకు ముందు జరిగింది అదే. అయినా మరోసారి ఇండస్ట్రీకి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడంటే ఖచ్చితంగా మరింత లోతైన అవగాహనతోనే నిర్ణయం తీసుకుని ఉంటాడు.

వీరి ఎంగేజ్మెంట్ డేట్ కూడా హాట్ గా మారింది. 8 - 8 - 8 ... అంటే 8వ నెల, 8 తేదీ, 8వ రోజు ( 2024 - 2+2 + 4= 8) న జరిగింది. ఈ రోజు ఉదయం 9.42 నిమిషాలకు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం పూర్తయింది. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా సోషల్ మీడియాలో ఫోటోస్ తో పాటు ప్రకటించాడు. ఈ జంట కలకాలం హ్యాపీగా ఉండాలని ఆకాంక్షించాడు.

మొత్తంగా రూమర్స్ అన్నీ నిజం కావాలని లేదు. బట్ చైతూ, శోభిత విషయంలో రూమర్స్ వచ్చినా.. ఏమో..కాదేమో అనిపించేలా ప్రవర్తించారు. వీలైనంత ఎక్కువ డిస్టన్స్ పాటించారు. ఓ దశలో చైతన్యకు మరో హీరోయిన్ తో పెళ్లి అన్న న్యూస్ కూడా వచ్చాయి. అప్పుడు ఇది రూమర్ అనుకున్నారు. బట్ ఇప్పుడ అదే రూమర్ అయింది. మరి ఈ జంట చైతన్య శోభితంగా జీవితాంతం ‘కలిసి’ ఉండాలని కోరుకుంటూ.. కాబోయే కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుదాం.

Tags

Next Story