Naga Chaitanya and Sobitha : బిగ్ బాస్ హౌస్లోకి చైతు, శోభిత?

Naga Chaitanya and Sobitha : బిగ్ బాస్ హౌస్లోకి చైతు, శోభిత?

సీజన్ -8 బిగ్ బాస్ హౌస్ లోకి కాబోయే వధూవరులు అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంట్రీ ఇవ్వబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఈ ఎపిసోడ్లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. బిగ్బాస్ సీజన్ 8కి ప్రేక్షకుల నుంచి నెగటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఒక్కరు ఇద్దరు తప్ప మిగిలిన వారు ఎవ్వరూ పెద్దగా తెలియదు. ఆ ఒక్కరు ఇద్దరు కూడా పెద్ద ఫేమస్ ఏమీ కాదు. ఇలాంటి కంటెస్టెంట్స్ తో ఈ సీజన్ ను ఎలా నెట్టుకు వస్తారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో హౌస్ లోకి పలువురికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారట. ప్రత్యేక అతిథులు కూడా ఈ సారి హౌస్ లో అడుగు పెట్టి ఆసక్తి పెంచే విధంగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. బిగ్బాస్ హౌస్ లోకి త్వరలోనే నాగ చైతన్య, శోభితలు అతిథులుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. సాధారణంగా ఏదైనా సినిమా ప్రమోషన్ లేదా ప్రోడక్ట్ ప్రమోషన్కి మాత్రమే సెలబ్రిటీలు హౌస్ లో అడుగు పెడతారు. మరి నాగ చైతన్య, శోభిత ఏ కారణంతో హౌస్ లో అడుగు పెట్టబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి చైతూ, శోభిత ఎంట్రీపై ఎలాంటి క్లారిటీ రాలేదు.

Tags

Next Story