సినిమా

Naga Chaitanya: ఆ లవ్ లెటర్ నాకో గ్రీన్‌లైట్ : చైతూ ఆసక్తికర పోస్ట్

Naga Chaitanya: తాజాగా చైతన్య ఇన్‌స్టా పోస్ట్ అభిమానులకో సర్‌ప్రైజ్. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Naga Chaitanya: ఆ లవ్ లెటర్ నాకో గ్రీన్‌లైట్ : చైతూ ఆసక్తికర పోస్ట్
X

Naga Chaitanya: సామ్, చైతూ ఎంత చూడముచ్చటైన జంట.. విడివిడిగా బతికేస్తూ బావున్నామని చెప్పుకున్నా, ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీగా ఉన్నా, ఇంకా ఆ జ్ఞాపకాలు వారి జీవితాల్లో చెరగని ముద్రలుగా మిగిలిపోతూనే ఉంటాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత రెగ్యులర్‌గా ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. అయితే చైతూ చాలా అరుదుగా స్పందిస్తాడు.. తన అంతరంగాన్ని అభిమానులతో పంచుకోవడం తక్కువగా జరుగుతుంటుంది. కానీ తాజాగా చైతన్య ఇన్‌స్టా పోస్ట్ అభిమానులకో సర్‌ప్రైజ్. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాను రీసెంట్‌గా చదివిన పాపులర్ రైటర్ మాథ్యూ రాసిన బుక్ 'గ్రీన్ లైట్స్' అనే పుస్తకం గురించి ఆసక్తికర కామెంట్ చేశాడు. లవ్ లెటర్స్ టూ లైఫ్ అంటూ మీ జర్నీని షేర్ చేసినందుకు ధన్యావాదాలు మాథ్యూ..

ఈ పుస్తకం నాకు నిజంగా గ్రీన్ లైట్ లాంటిదే.. (జీవితంలో ముందుకు వెళ్లడం అనే అర్థం) అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఎప్పుడూ ఏ విషయంపై కూడా త్వరగా రియాక్ట్ కాని చైతన్య.. ఇప్పుడు ఇలా పోస్ట్ చేయడంతో అభిమానులు సంతృప్తి చెందుతున్నారు.

చైతూ మళ్లీ మామూలు మనిషి అవడానికి సంసిద్ధుడవుతున్నాడని అనుకుంటున్నారు. కాగా, చైతన్య తండ్రి నాగార్జున నటిస్తున్న బంగార్రాజు చిత్రంలో నటిస్తున్నాడు. చైతూకి జోడీగా కృతిశెట్టి నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఈ చిత్రంపై హైప్ క్రియేట్ చేసింది.

Next Story

RELATED STORIES