Naga Chaitanya: ఆ మ్యాటర్ లో చైతు.. సమంతనే ఫాలో అవుతున్నాడుగా!

Naga Chaitanya (tv5news.in)
Naga Chaitanya: కొన్ని విషయాలు జరిగి ఎన్ని రోజులైనా.. వాటిని మర్చిపోవడం చాలా కష్టం. చైసామ్ ఫ్యాన్స్‌కు కూడా వారి విడాకుల విషయం జీర్ణించుకోవడం ఇప్పటికీ కష్టంగానే ఉంది. కానీ సమంత, నాగచైతన్య మాత్రం దీని మీద ఏ మాత్రం స్పందించకుండా ఎవరి కెరీర్‌లో వారు బిజీగా గడిపేస్తున్నారు. అసలు ఏమీ జరగనట్టుగానే ఉంటున్నారు. నాగచైతన్య, సమంత పోటాపోటీగా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను సైన్ చేస్తున్నారు.
సమంత.. ముందునుండే తన నటనకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. కంటెంట్ ఉన్న స్క్రిప్ట్స్‌ను ఎంచుకోవడంలో సమంత స్పెషలిస్ట్ లాగా మారిపోయింది. సౌత్ ప్రేక్షకులను మెప్పించడంలో వందశాతం సక్సెస్ అయిన సమంత.. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో హిందీవారిని కూడా విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో తనకు అక్కడి నుండి కూడా ఆఫర్లు వెల్లువెత్తాయి.
సమంత ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్‌ను సైన్ చేసింది అనగానే తన అభిమానులంతా ఆశ్చర్యపోయారు. అందులోనూ ఒక వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పింది అనగానే వారంతా అసలు సామ్ ఎందుకిలా చేస్తుంది అనుకున్నారు. కానీ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చూసిన తర్వాత ఒక్కసారిగా వారందరి నోళ్లు మూతబడ్డాయి. అయితే సామ్ లాగే చైతు కూడా త్వరలోనే ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నాడని టాక్ వినిపిస్తోంది.
నాగచైతన్య ఇప్పటికే ప్రముఖ ఓటీటీ అమేజాన్ ప్రైమ్‌లో ఒక వెబ్ సిరీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇప్పటికే లవ్ స్టోరీ సినిమాతో సక్సెస్ ఫార్మ్‌ను ఎంజాయ్ చేస్తున్న చైతూ.. ఉన్నపళంగా వెబ్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం పలువురిని ఆశ్చర్యపరిచినా.. సామ్ లాగే తాను కూడా వెబ్ సిరీస్ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాడని తన అభిమానులు నమ్మకంతో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com