Naga Chaitanya: ఎనిమిదేళ్ల తర్వాత పూజా హెగ్డేతో చైతూ.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సినిమాలో..
Naga Chaitanya: ఒక్కొక్కసారి ఒక్క సినిమా కలిసి చేసినందుకే హీరో, హీరోయిన్ పెయిర్‌కు విపరీతమైన పాపులారిటీ వచ్చేస్తుంది. కానీ దానికి తగినట్టుగా వారు మళ్లీ మళ్లీ కలిసి యాక్ట్ చేసే ఛాన్స్ మాత్రం ఉండదు. అలాంటి ఒక పెయిర్ నాగచైతన్య, పూజా హెగ్డే. వీరిద్దరు కలిసి నటించి ఎనిమిదేళ్లు అయ్యింది. త్వరలో ఓ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సినిమాలో వీరిద్దరు హీరో, హీరోయిన్‌గా కనిపించనున్నట్టు టాక్.
నాగచైతన్య హీరోగా తెరకెక్కిన 'ఒక లైలా కోసం' చిత్రంతో పూజా హెగ్డే హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యింది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ.. స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ప్రస్తుతం పూజా చేతిలో ఉన్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే. మరొకసారి తాను డెబ్యూ చేసిన హీరోతోనే పూజా జతకట్టనుందని సమాచారం.
నాగచైతన్య సినిమాల సెలక్షన్ విషయంలో మునుపటికంటే స్పీడ్ పెంచాడు. వరుసగా నచ్చిన స్క్రిప్ట్స్‌ను ఓకే చేయడమే కాకుండా వాటిని సెట్స్‌పైకి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు చెప్పిన కథకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
యాక్షన్ థ్రిల్లర్స్ తెరకెక్కించడంలో వెంకట్ ప్రభు దిట్ట. ఇటీవల ఆయన తెరకెక్కించిన 'మానాడు' తమిళంలో కాదు తెలుగులో కూడా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ దర్శకుడిని నాగచైతన్య త్వరలోనే తెలుగులో పరిచయం చేయనున్నాడట. అంతే కాకుండా ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే కనిపించనుందని సమాచారం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com