Naga Chaitanya: నాగచైతన్య మనసులో మాట.. ఆమెతో కలిసి నటించాలని ఉంది..

Naga Chaitanya: నాగచైతన్య మనసులో మాట.. ఆమెతో కలిసి నటించాలని ఉంది..
Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ నాగచైతన్య బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి దక్షిణాదిలోనూ తన సత్తా చాటాలనుకుంటున్నాడు.. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రంలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.

Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ నాగచైతన్య బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి దక్షిణాదిలోనూ తన సత్తా చాటాలనుకుంటున్నాడు.. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రంలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.

ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా, మజిలీ నటుడు చాలా మంది నటీమణులతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. నటీమణులు ఎవరితో కలిసి పనిచేయాలనుకుంటున్నారని అడిగితే.. అలియా భట్, ప్రియాంక చోప్రా మరియు కత్రినా కైఫ్‌లతో కలిసి పనిచేయాలని ఉందని తన కోరికను వ్యక్తం చేశాడు.

ఇంకా "చాలా మంది నటీమణులు ఉన్నప్పటికీ, అలియా భట్ నటన అంటే చాలా ఇష్టం. అవకాశం వస్తే ఆమెతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను అని చెప్పారు.

సుస్మితా సేన్ తన మొదటి సెలబ్రిటీ క్రష్ అని వెల్లడించాడు. మరి మీరు ఎప్పుడైనా ఆమెను కలుసుకుని ఈ విషయం ఆమెకు కూడా చెప్పారా అని అడిగినప్పుడు, అతను 'అవును, తప్పకుండా' చెబుతా అన్నాడు.

అమీర్ ఖాన్ మరియు నాగ చైతన్య నటించిన లాల్ సింగ్ చద్దా భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 37.96 కోట్లు రాబట్టింది. అద్వైత్ చందన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేయడంలో విఫలమైంది.

Tags

Read MoreRead Less
Next Story