Naga Chaitanya: ఒకరు తమిళం, ఒకరు మలయాళం.. ఇద్దరు భామలతో చైతూ రొమాన్స్..

Naga Chaitanya (tv5news.in)
Naga Chaitanya: ప్రస్తుతం నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సమంతతో విడాకుల తర్వాత చైతూ తన కెరీర్‌పై ఎక్కువ దృష్టిపెడుతున్నాడు అని భావిస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఎక్కువ సినిమాల్లో నటించడమే కాకుండా ప్రయోగాల వైపు కూడా అడుగులేస్తున్నాడు. తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ కోసం ఓ కోలీవుడ్, ఓ మాలీవుడ్ భామలతో రొమాన్స్ చేయనున్నాడు చైతూ.
నాగచైతన్య, విక్రమ్ కుమార్ కలిసి ప్రస్తుతం 'థాంక్యూ' అనే సినిమా కోసం పనిచేస్తున్నారు. అంతే కాకుండా తాజాగా వీరిద్దరు కలిసి 'దూత' అనే ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టారు. అయితే ఇది సినిమా కాదు.. వెబ్ సిరీస్. నాగచైతన్య ఇప్పటివరకు ఓటీటీ వైపు అడుగు వేయలేదు. అయితే తాజాగా ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. పైగా ఇదొక హారర్ వెబ్ సిరీస్ కావడం విశేషం. ప్రస్తుతం దూత షూటింగ్ కూడా ప్రారంభించుకుంది.
Yuvasamrat #NagaChaitanya malayalam actress #Parvathy & @priya_Bshankar from the sets of Amazon Prime Horror web series #Dootha 🎥 pic.twitter.com/G3M4NIPD5y
— Milagro Movies (@MilagroMovies) March 9, 2022
దూత కోసం ఇద్దరు హీరోయిన్లను బరిలోకి దింపనున్నాడు దర్శకుడు విక్రమ్ కుమార్. ఇప్పటికే కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్.. చైతూతో స్క్రీన్ షేర్ చేసుకోనుందని వార్తలు వైరల్ కాగా.. అవి నిజమే అని కన్ఫర్మ చేసేలాగా మూవీ టీమ్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే అందులో నాగచైతన్య, ప్రియా భవానీ శంకర్, విక్రమ్ కుమార్‌తో పాటు ఇంకొక మలయాళ భామ కూడా ఉంది.
పార్వతి నాయర్.. ఈ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోయినా.. మలయాళ సినిమాలను ఫాలో అయ్యేవారికి తను సుపరిచితమే. ఏ సినిమా అయినా, ఏ పాత్ర అయినా తన పూర్థిస్థాయిలో ప్రేక్షకులను మెప్పించే పార్వతి.. ఇప్పటికే మాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా దూతతో తెలుగులోకి కూడా అడుగుపెట్టనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com