Naga Chaitanya: మామ వద్దన్నాడు.. అల్లుడు ఓకే అన్నాడు..

Naga Chaitanya: మామ వద్దన్నాడు.. అల్లుడు ఓకే అన్నాడు..
Naga Chaitanya: అనుకోని కారణాల వల్ల వెంకీ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడట. అదే ప్లేస్‌లోకి నాగచైతన్య వచ్చినట్టు టాక్.

Naga Chaitanya: మామూలుగా ఒక దర్శకుడు ఒక హీరో కోసం రాసుకున్న కథ.. చాలామంది హీరోల దగ్గరకు తిరిగి ఫైనల్‌గా ఎవరితో ఓకే అనిపించుకుంటుందో తెలియదు. మామూలుగా ఓ హీరో కోసం రాసిన కథ.. ఆ హీరో ఓకే చేయడం కంటే వేరే హీరోలు ఓకే చేసిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రస్తుతం ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథను మామ రిజెక్ట్ చేస్తే అల్లుడు ఓకే చేసినట్టు సమాచారం.

యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించింది రెండు సినిమాలే. కానీ ఇప్పటికీ అవి చాలామందికి ఫేవరెట్. తాను మరో సినిమాను ఎప్పుడెప్పుడు తెరకెక్కిస్తాడా అని ఎదురుచూసేవారి సంఖ్య కూడా ఎక్కువే. ఇలాంటి దర్శకుడు మధ్యలో చాలామంది సీనియర్ హీరోలతో సినిమాలు చేయనున్నాడని రూమర్స్ వినిపించాయి. కానీ వాటిలోని ఏ ఒక్కదానిలో కూడా నిజం లేదు. చివరిగా విక్టరీ వెంకటేశ్‌తో తరుణ్ భాస్కర్ మూవీ ఓకే అయ్యిందని రూమర్ గట్టిగా వినిపించింది.

తరుణ్ భాస్కర్.. వెంకటేశ్ కోసం ఓ కథ సిద్ధం చేశాడట. ఆ కథను వెంకటేశ్ కూడా ఫైనల్ చేశాడన్న వార్త కొన్నిరోజులు ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొట్టింది. కానీ అనుకోని కారణాల వల్ల వెంకీ మామ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడట. ఇప్పుడు అదే ప్లేస్‌లోకి నాగచైతన్య వచ్చినట్టు టాక్. వెంకటేశ్ వద్దనుకున్న కథ నాగచైతన్యకు నచ్చడంతో.. చైతూ, తరుణ్ భాస్కర్ కాంబినేషన్ ఫిక్స్ అయినట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story