Naga Chaitanya: సమంతను ఎప్పటికీ గౌరవిస్తుంటా.. మళ్లీ ప్రేమలో పడతానేమో: నాగచైతన్య

Naga Chaitanya: కూల్‌గా, కామ్‌గా ఉండే నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్నాడంటే ఒక పట్టాన ఎవరికీ నమ్మాలనిపించలేదు.. క్యూట్ కపుల్ ఎందుకు విడిపోయారని ఎంతో బాధపడిపోయారు ఫ్యాన్స్.. మళ్లీ కలుసుకుంటే బావుండని కూడా ఆశపడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా అవే ప్రశ్నలు.. ఏ సినిమా ప్రమోషన్‌కి వెళ్లినా అవే మాటలు.. నాగచైతన్య తాజా చిత్రం 'లాల్ సింగ్ చద్దా' ప్రమోషన్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు..
తాజాగా తన విడాకులపై మరోసారి స్పందించాడు. తప్పని పరిస్థితుల్లో విడిపోయాం.. ఇప్పుడు ఎవరి జీవితాలు వారు గడుపుతున్నా మళ్లీ అవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. విడాకులు తీసుకున్నప్పటికీ మాకు ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది. సామ్ చేసే ప్రతి వర్క్‌ని చూస్తూనే ఉంటా. ఆమెను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా. విడిపోయిన నాటి నుంచి ఇప్పటికి నావి మూడు సినిమాలు విడుదలయ్యాయి. కానీ అందరూ మా విడాకుల గురించే మాట్లాడుతున్నారు. ఎప్పుడూ ఇవే ప్రశ్నలతో వేధిస్తున్నారు.. దానివల్ల విసిగిపోతున్నా అని నాగచైతన్య చెప్పుకొచ్చారు.
మళ్లీ ప్రేమలో పడతారా అనే ప్రశ్నకు చైతూ పాజిటివ్‌గా స్పందించారు.. తప్పకుండా.. ఎవరికి తెలుసు భవిష్యత్తులో ఏం జరగనుందో.. మనిషి జీవించడానికి ఊపిరి ఎంత అవసరమో.. ప్రేమ కూడా అంతే అవసరం.. మనం ప్రేమించాలి. ఎదుటివారి ప్రేమను సొంతం చేసుకోవాలి. అలా జరిగితేనే ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండగలుగుతాం అని చైతన్య వివరించారు.
కానీ సామ్ మాత్రం కాఫీ విత్ కరణ్‌లో భవిష్యత్తులో ప్రేమలో పడే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ప్రస్తుతం వర్క్‌ని ప్రేమిస్తోంది.. వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటోంది.. చైతన్య చెప్పినట్లు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు.. లెట్స్ వెయిట్ అండ్ సీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com