సమంతపై నాగ చైతన్య ప్రశంసలు

సమంతపై నాగ చైతన్య ప్రశంసలు
నాగచైతన్య ఎక్కడ కనిపించినా ఆ ప్రశ్న అడగందే ఇంటర్వ్యూ ముగియదు.

నాగచైతన్య ఎక్కడ కనిపించినా ఆ ప్రశ్న అడగందే ఇంటర్వ్యూ ముగియదు. కొత్తగా ఏమైనా చెప్తాడా లేక పాత కథే పాడతాడా అని ఆసక్తి. హూ.. ఇప్పుడు చైతు పాత ప్రశ్నకు కొత్తగా సమాధానం చెప్పాడు.. మాజీ భార్య సమంత చాలా మంచి వ్యక్తి అని. తాను నటించిన కస్టడీ సినిమా విడుదల సందర్భంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న చైతూ.. సమంతపై ప్రశంసల వర్షం కురిపించాడు. దీంతో అభిమానులు చాలా ఆశ్చర్యపోతున్నారు. "అవును. మేం విడిపోయి రెండేళ్లు దాటింది, అధికారికంగా విడాకులు తీసుకుని ఏడాది దాటింది. కోర్టు మాకు విడాకులు మంజూరు చేసింది. మేమిద్దరం మా జీవితాలను కొనసాగిస్తున్నాం. నా జీవితంలో ఆ దశ పట్ల నాకు విపరీతమైన గౌరవం ఉంది అని చైతూ చాలా హూందాగా మాట్లాడాడు.

అయితే మీడియా తనకు, సమంతకు మధ్య విషయాలను చాలా ఇబ్బందికరంగా మార్చిందని నాగ చైతన్య తెలిపాడు. మీడియా ఊహాగానాలతో మా మధ్య విషయాలు ఇబ్బందికరంగా మారాయి. ప్రజల దృష్టిలో, పరస్పర గౌరవం తొలగిపోతుంది. దాని గురించి నేను బాధపడ్డాను" అని చైతన్య వివరించాడు. సమంత కొన్ని బాలీవుడ్ చిత్రాలతో సహా ఆమె సిటాడెల్ కోసం ది ఫ్యామిలీ మ్యాన్ ద్వయం రాజ్, డికెతో జతకట్టింది. ఇందులో వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇంకా సమంత హారర్ కామెడీ కోసం ఆయుష్మాన్ ఖురానాతో జతకట్టనున్నట్లు తెలుస్తోంది. తెలుగులో విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి చిత్రం విడుదల కావలసి ఉంది. నాగ చైతన్య కస్టడీ చిత్రం మే 12,న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Read MoreRead Less
Next Story