Naga Chaitanya Samantha Divorce: సమంత, నేను విడిపోతున్నాం: నాగచైతన్య

X
By - Divya Reddy |2 Oct 2021 3:47 PM IST
Naga Chaitanya Samantha Divorce: గత కొంతకాలంగా టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా నాగచైతన్య, సమంత విడాకుల గురించే వార్తలు..
Naga Chaitanya Samantha Divorce: గత కొంతకాలంగా టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా నాగచైతన్య, సమంత విడాకుల గురించే వార్తలు వినిపిస్తున్నాయి. వారిద్దరూ విడిపోతున్నారని, విడాకుల గురించి నిర్ణయం కూడా తీసుకున్నారని ఇలా ఎన్నో కథనాలు వినిపిస్తూనే ఉన్నా దానికి వారిద్దరూ ఏ మాత్రం రెస్పాండ్ అవ్వలేదు. చాలాకాలంగా వీరిద్దరు కలిసి ఎక్కడా కనిపించట్లేదు. ఒకరి సినిమాల గురించి ఒకరు మాట్లాడడం కూడా మానేసారు. అందుకే ఆ వార్తలు మరింత బలంగా వినపడం మొదలయింది. తాజాగా ఆ వార్తలపై క్లారిటీ ఇస్తూ చైతు తన ట్విటర్‌లో పోస్ట్ చేసాడు. సమంత, తాను నిజంగానే విడిపోతున్నామని, భార్య, భర్తలకు విడిపోయినా.. వారు ఎప్పటికీ మంచి స్నేహితులే అని స్పష్టం చేసాడు.
— chaitanya akkineni (@chay_akkineni) October 2, 2021
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com