Naga Chaitanya Samantha Divorce: సినిమా ఫ్లాప్.. చైసామ్ ప్రేమకథ హిట్..

Naga Chaitanya Samantha Divorce: ఏ మాయ చేశావే అంటూ ప్రేమ పడ్డ నాగచైతన్య.. ఆ తర్వాత ఆమెతో ఏడడుగులు నడిచాడు. నాలుగేళ్ల ప్రయాణంలో ఆదర్శమైన కపుల్‌గా టాలీవుడ్‌లో నిలిచారు. ఆ తర్వాత ఏమైందో ఏమో.. విడాకులకు సిద్ధమయ్యారు.
నాగ చైతన్య, సమంత మధ్య దశాబ్దం పాటు సాగిన రొమాన్స్ అందరి దష్టిని ఆకర్షించింది. 2009లో 'ఏం మాయ చేశావే' సినిమా షూట్లో వీరు కలుసుకుని, మంచి ఫ్రెండ్స్ అయి సాన్నిహిత్యాన్ని ఎంజాయ్ చేసారు. 2014లో వీరిమధ్య ప్రేమ చిగురుంచి, బలమైన బంధంగా మారింది. సరిగ్గా చెప్పాలంటే "ఆటో నగర్ సూర్య" వీరి ప్రేమకు సరైన దిశానిర్దేశం చేసింది. ఈ సినిమా ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఆఖరికి లేట్ గా రిలీజ్ అయినప్పటికీ, సినిమా ఫ్లాప్. కానీ అప్పుడే వీరిద్దరి ప్రేమ మాత్రం పట్టాలెక్కి, సూపర్ హిట్ అయింది.
ఈ సినిమా షూటింగ్ లో వీరిద్దరూ పూర్తిగా క్లోజ్ అయిపోయారు. 2015 వచ్చేసరికి వీరు ఏకంగా పబ్లిక్ గా అది కూడా ట్విట్టర్లోనే ఒకరిని ఒకరు ఫ్లర్ట్ చేసుకున్నారు. నాగచైతన్య పుట్టినరోజున బర్త్ డే విషెస్ చెప్పిన సమంత.. వీరిద్దరి మధ్య ఏదో ఉందని అర్థం వచ్చేలా, వీరిపై అందరికి అనుమానం కలిగేలా విషెస్ చెప్పింది. నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఎప్పటికీ, సదా..మరో గొప్ప వసంతంలోకి అడుగుపెడుతున్న నీకు శుభాకాంక్షలంటూ తమ ప్రేమ వ్యవహారంపై క్లూ ఇచ్చేశారు సమంత.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com