Naga Chaitanya: సమంతతో మాత్రమే అది సాధ్యమంటున్న చైతూ..

Naga Chaitanya: సమంతతో మాత్రమే అది సాధ్యమంటున్న చైతూ..
Naga Chaitanya: విడాకుల తర్వాత మొదటిసారి సమంతతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి మాట్లాడాడు చైతూ.

Naga Chaitanya: టాలీవుడ్‌లో ఒక్కసారిగా సెన్సేషన్ సృష్టించింది సమంత, నాగచైతన్యల విడాకుల విషయం. ఎవరు ఎంత అడిగినా కూడా విడాకులకు కారణం ఏంటో సమంత కానీ, నాగచైతన్య కానీ.. బయటపెట్టలేదు. ఇది వారిద్దరికి కరెక్ట్ అనిపించింది కాబట్టే విడిపోయామంటూ చైతూ ఇటీవల బయటపెట్టాడు. మొదట్లో చాలా మౌనంగా ఉన్న చైతూ.. ఇప్పుడిప్పుడే తన భావాలను బయటపెడుతున్నాడు. తాజాగా సమంత గురించి మరో విషయం బయటపెట్టాడు నాగచైతన్య.

సమంత, నాగచైతన్య పెళ్లి కాకముందే చాలా సినిమాల్లో నటించారు. సమంత హీరోయిన్‌‌గా పరిచయమయ్యిందే చైతూ సినిమాతో. వీరిద్దరు కలిసి చేసిన మొదటి సినిమా 'ఏమాయ చేశావే' నుండే వీరి కెమిస్ట్రీని చాలామంది ఇష్టపడ్డారు. అందుకే దర్శక నిర్మాతలు వీరిద్దరితో సినిమాలు చేయాలని క్యూ కట్టారు. అలా వీరిద్దరు కలిసి నాలుగు సినిమాలు చేశారు. చైతూ, సమంత కలిసి నటించిన చివరి చిత్రం 'మజిలీ'.

విడాకుల తర్వాత మొదటిసారి సమంతతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి మాట్లాడాడు చైతూ. సమంతతోనే తన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇది విన్న వీరి అభిమానులు మళ్లీ వీరు కలిసి సినిమాలు చేస్తే బాగుంటుందన్న విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికీ చాలామంది అభిమానులకు వీరింకా కార్తిక్, జెస్సీనే.

Tags

Read MoreRead Less
Next Story