Naga Chaitanya : బోయపాటితో నాగ చైతన్య.. స్కందను మర్చిపోయారా

తండేల్ సక్సెస్ నాగ చైతన్యలో చెప్పలేనంత ఆత్మవిశ్వాసాన్ని తెచ్చింది. అతనికి తన బ్యానర్ లో 100 పర్సెంట్ లవ్ తర్వాత మరో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు అల్లు అరవింద్. నిర్మాత బన్నీ వాసునే అయినా సినిమా విషయంలో ఎక్కువ చొరవ తీసుకుంది మాత్రం అరవిందే. కేవలం రివ్యూస్, మౌత్ టాక్ మాత్రమే కాదు.. ఈ మూవీ కలెక్షన్స్ కూడా బానే ఉన్నాయి. వీకెండ్ కే మాగ్జిమం బ్రేక్ ఈవెన్ అయిందనే టాక్ వచ్చింది. ఈ వారంలో కాస్త ఆకట్టుకుంటే లాభాలూ వస్తాయి. అటు డిజిటల్, శాటిలైట్ కూడా భారీగానే అయిందీ మూవీకి. సో.. చైతన్య చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అది కూడా కెరీర్ బెస్ట్ అనే కలెక్షన్స్ తో.
అయితే తండేల్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చైతూతో ఓ మాస్ మూవీ చేయబోతున్నాం అని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు అరవింద్. ఆ ప్రాజెక్ట్ బోయపాటి శ్రీను చేస్తాడు అనే టాక్ కూడా ఉంది. బోయపాటి గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ మూవీని చైతన్యతోనే చేయించాలనే ఆలోచనలో ఉన్నారట. బట్ ఇది కరెక్ట్ నిర్ణయమా అంటే ఖచ్చితంగా కాదు అనే చెప్పాలి. ఎందుకంటే నాగ చైతన్య ఇమేజ్ కి కటౌట్ కి బోయపాటి రేంజ్ డైరెక్షన్ సూట్ కాదు అని చెప్పొచ్చు.
నాగ చైతన్య కూడా గతంలో మాస్ మూవీస్ ట్రై చేశాడు. కానీ ఏవీ పెద్దగా వర్కవుట్ కాలేదు. చూస్తే అవేవీ ఊరమాస్ మూవీస్ కాదు. అయినా వర్కవుట్ కాలేదు. ఇటు చూస్తే బోయపాటి సినిమా అంటే ఏ రేంజ్ లో ఊరమాస్ ఉంటుందో తెలుసు కదా. అది ఊహించకనే రామ్ పోతినేని స్కంద అనే మూవీ చేసి భంగపడ్డాడు. హీరోల కటౌట్ తో పనిలేకుండా కేవలం తన కోసం సినిమా చూస్తారు అని భావించే రకం బోయపాటి. బట్ కటౌట్ కూడా ఇంపార్టెంటే అని స్కందతో తేల్చారు ఆడియన్స్. సో.. చైతూ మాస్ మూవీ చేసినా బోయపాటితో కాకుండా ఉంటేనే బెటర్ అని చెప్పొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com