Naga Chaitanya: కొత్త బాటలో నాగచైతన్య.. ప్రయోగానికి సిద్ధం..

Naga Chaitanya (tv5news.in)
Naga Chaitanya: అక్కినేని హీరోలందరికీ టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందులో ఎవరి దారి వారిదే. ఎవరికి నచ్చిన కథలను వారు ఎంచుకుంటారు. నచ్చిన కథ దొరికితే మల్టీస్టారర్ కూడా చేస్తారు. ఇప్పటికే మల్టీ స్టారర్‌తో హిట్ కొట్టిన నాగచైతన్య.. కొత్త ప్రయోగం వైపు అడుగులు వేస్తున్నాడు. ముందెన్నడూ చేయని ప్రయోగానికి ఈరోజే శ్రీకారం చుట్టాడు చైతూ.
విక్రమ్ కే కుమార్.. అక్కినేని కుటుంబానికి దగ్గరయిన దర్శకుడు. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల నటులు నటించిన 'మనం' సినిమాను డైరెక్ట్ చేసి వారి కుటుంబంలో ఒకడిగా మారిపోయాడు విక్రమ్. ఆ తర్వాత అఖిల్‌తో 'హలో' సినిమా చేసినా కూడా కమర్షియల్‌గా అది అంతగా సక్సెస్ కాలేకపోయింది. అందుకే తమ్ముడికి హిట్ ఇవ్వలేకపోయినా.. అన్నయ్యకు మాత్రం కచ్చితంగా హిట్ ఇవ్వాలని అనుకుంటున్నాడు విక్రమ్.
నాగచైతన్య ఇప్పటివరకు వెండితెరకే పరిమితమయ్యాడు. పైగా తాను నటించిన ఏ సినిమా కూడా నేరుగా ఓటీటీలో విడుదల కాలేదు. కానీ మొదటిసారి ఏకంగా వెబ్ సిరీస్‌లోనే నటించడానికి సిద్ధమయ్యాడు చైతూ. 'దూత' అనే పేరుతో విక్రమ్ కుమార్ తెరకెక్కుస్తున్న వెబ్ సిరీస్‌లో చైతూనే హీరో. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఈరోజే ప్రారంభమయ్యింది. దీనికి సంబంధించిన ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు నాగచైతన్య.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com