Naga Chaitanya Divorce: బావ (సుమంత్) బాటలోనే బామ్మర్థి( నాగ చైతన్య).. రెండో పెళ్లిపై..?
బావ సుమంత్ విషయంలో ఏది జరిగిందో అదే జరిగింది నాగచైతన్య వివాహ బంధం విషయంలో.. తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో జోడీ కట్టిన కీర్తి రెడ్డికి.. సుమంత్‌కి రెండేళ్లు లవ్ ట్రాక్ నడిచింది. మొదట సహజీవనం చేసి ఆ తరువాత పెళ్లితో ఒకింటి వారయ్యారు. కానీ ఆ బంధం ఎంతో కాలం నిలవలేదు. ఏడాదిన్నరలోనే తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. విడాకుల అనంతరం కీర్తి రెడ్డి మళ్లీ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లైంది.
కానీ సుమంత్ పెళ్లి ప్రస్తావన ఈ మధ్య తెరపైకి వచ్చినా మళ్లీ ఆ ఊసు ఎత్తలేదు. అయితే ఇప్పుడు సుమంత్ బామ్మర్థి నాగచైతన్య విషయంలోనూ ఇలానే జరుగుతోంది. సమంతను పెళ్లి చేసుకుని మూడేళ్లే అయింది.. ఇద్దరూ ఒకిరికొకరు అర్థం చేసుకున్నారో.. అపార్థం చేసుకున్నారో తెలియదు కానీ విడిపోతున్నారు. వివాహం అనే బంధానికి అర్థం లేకుండా పోతోంది ఈ మధ్య విడిపోతున్న జంటలను చూస్తుంటే .
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com