Naga Chaitanya : అమ్మా చైతూ.. అసలు 'బంగార్రాజు'వి నువ్వే..!
Naga Chaitanya : ఇప్పుడు అక్కినేని హీరో నాగచైతన్య హవా మాములుగా లేదు.. వరుసగా నాలుగు హిట్స్ కొట్టి మంచి జోష్‌లో ఉన్నాడు చైతూ.. తాజాగా తన తండ్రి నాగార్జునతో కలిసి చేసిన బంగార్రాజు సినిమా సూపర్ హిట్ కావడం చైతూకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పాలి.
ఈ మధ్యకాలంలో సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో వైరల్ వీడియోలతో నాగచైతన్య వార్తల్లో నిలుస్తున్నాడు. బంగార్రాజు మ్యూజికల్ ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతుండగా హీరోయిన్ దక్ష నగర్కర్ వైపు చూస్తూ ఆమె కొంటె చూపులకు చైతూ సిగ్గుపడిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.
తాజాగా బంగార్రాజు సక్సెస్ మీట్ రాజమండ్రిలో జరిగింది. ఈ ఈవెంట్‌లో నాగార్జున స్టేజ్‌పై మాట్లాడుతుండగానే కృతిశెట్టితో మాటలు కలుపుతూ ఒకరినొకరు చూసుకుంటూ చిలిపిగా నవ్వుకున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ రెండు వీడియోస్ చూసిన నెటిజన్లు అమ్మా చైతూ అసలు బంగార్రాజువి నువ్వే అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
— ₳ ₭ 🦋 (@itsmeGAK) January 18, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com